నేను విన్నాను..నేను ఉన్నాను…2019 ఎన్నికలకు ముందు ప్రతి బహిరంగ సభలోనూ జగన్ చెప్పిన పంచ్ లైన్. మీరు చూశారు. మీరు వేస్తారు అన్నది 2024 ఎన్నికలను టార్గెట్ చేస్తూ జగన్ చెప్పబోయే కొత్త పంచ్ లైన్ ఇది. తాజాగా ముగిసిన ప్లీనరీలో ప్రసంగించిన జగన్…పరోక్షంగా ఇలానే వ్యాఖ్యానించడం ఇపుడు హాట్ టాపిక్ అయింది. మీరు నమ్మితేనే..మమ్మల్ని గెలిపించండి…కానీ, ప్రతిపక్షాల మాయలో పడకండి అంటూ జనానికి జగన్ వేసిన బిస్కట్ ఇదే అర్థంలోకి వస్తుంది.
అమ్మ రాజీనామాతో మొదలైన ప్లీనరీ సమావేశాలు అబ్బాయి శాశ్వత అధ్యక్షుడిగా ఎంపిక కావడంతో ముగిశాయి. ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు చాలాకాలంగా అంటున్నారు. ఇపుడు, జగన్ కూడా ప్లీనరీ వేదికగా అదే విషయాన్ని పరోక్షంగా చెప్పినట్లు కనిపిస్తోంది. అందుకే, తనకు 175 స్థానాలు కట్టబెట్టాలని వైసీపీ నేతలకు జగన్ పిలుపునిచ్చారని తెలుస్తోంది.
ఇక, విపక్షాలపై, కొన్ని మీడియా చానెళ్లపై కూడా ఆరోపణలు చేసి ఆ సింపతీని కొట్టేద్దామని జగన్ ప్లాన్ వేసినట్లు కనిపిస్తోంది. ఇటువంటి మాటలతో తాను ఒంటరి అన్న ఫీలింగ్ ని జనాల్లో కలిగించి…ఓట్లు రాబట్టుకోవాలన్నది జగన్ ప్లాన్. మీరు విపక్షాల తీరు చూస్తున్నారు..మీకు అన్నీ తెలుసు అంటూ జనాన్ని మాయచేయాలని జగన్ అనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి అధికారం ఇవ్వాలి. ఎవరిని సీఎం చేయాలన్నది మీరే నిర్ణయించండి అంటూ జగన్ ఏపీ ప్రజలను కోరడం కొసమెరుపు.
ఇక, ఈ క్రమంలోనే జగన్ త్వరలోనే బస్సు యాత్ర చేపట్టబోతున్నారని, జనాల్లో తిరిగేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా..కేసీఆర్ తరహాలోనే జగన్ కూడా ముందస్తుకు వెళ్లి ప్రతిపక్షాలకు చాన్స్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Comments 1