వేదిక : వైసీపీ ప్లీనరీ..
సీన్–1 : విజయమ్మ ప్రసంగం..
వైసీపీ ప్లీనరీలో ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు.. విజయమ్మ ప్రసంగించారు. అయితే.. ఈ ప్రసంగం వెనుక చోటు చేసుకున్న అనేక విషయాలు ఇప్పుడు వెలుగు చూస్తున్నారు. అవేంటంటే.. విజయమ్మ ప్రసంగం ప్రారంభించగానే.. అప్పటి వరకు మొహంలో ఏదో సంతోషం.. పార్టీ అభిమానులను, కార్యకర్తలను చూస్తూ.. అనర్గళంగా ప్రసంగం.. ఎక్కడా తడబాటు లేదు.. ఎక్కడా తత్తర పాటు అంతకన్నా లేదు. రాసుకున్న స్క్రిప్టు అంతకన్నా కాదు. బహుశ అందుకేనేమో.. మాటల ప్రవాహం.. గోదావరి వరదలా పొంగుకొచ్చింది. ఇదీ.. వైసీపీ ప్లీనరీలో విజయమ్మ ప్రసంగంలో ఫస్ట్ సీన్. హాజరైన జనాలను చూస్తూ.. ఆమె వైఎస్‌ను పొగుడుతూ.. కాంగ్రెస్‌ను విమర్శిస్తూ.. జగన్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ.. సాగిన ప్రసంగం.
సీన్ – 2: విజయమ్మ ప్రసంగం..
ఇక్కడకు వచ్చే సరికి.. పోడియం ముందు నిలబడ్డ విజయమ్మ తనకు కుడిపక్క నుంచి ఎదో సంజ్ఞ వచ్చే సరికి అటు తిరిగి చూశారు. ఆ వెంటనే కెమెరాలు అన్నీ.. జనాలపైకి మళ్లాయి.(అంటే.. అక్కడ సీన్ చూపించకూడదని) ఇంతలో ఏదో పేపర్.. విజయమ్మ పోడియంపైకి వచ్చింది. అంతే! సీన్ కట్ చేస్తే.. అప్పటి వరకు అనర్గళంగా ప్రసంగించిన విజయమ్మ.. అప్పటి వరకు కనీసం.. తన రాజీనామా అయినా.. ప్రస్తావించని విజయమ్మ.. అనూహ్యంగా రాజీనామా అంశాన్ని ప్రస్తావించారు. అంతేకాదు.. “పదే పదే కిందికి చూస్తూ.. అక్షరం అక్షరం కూడుకుని.. వాక్యం వాక్యం.. పేర్చుకుని అప్పగించారు“
సీన్ –3
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్టు విజయమ్మ సంచలన ప్రకటన చేశారు. ఇక నుంచి తాను తెలంగాణలో తన బిడ్డ షర్మిల పార్టీకి పనిచేయనున్నట్టు వెల్లడించారు. కట్ చేస్తే.. ఈ సీన్లో ఎక్కడా సంతోషం లేదు.. ఆనందం లేదు.. అనర్గళం అంతకన్నా లేదు. `ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును చదువుతున్నట్టే“ అనిపించిందని పరిశీలకులు చెబుతున్నారు.
అంటే.. ఇక్కడ జరిగిందేంటంటే.. పార్టీ నుంచి ఆమెను బయటకు పంపించారనే చర్చకు బలం చేకూర్చే ఘటనలని అంటున్నారు పరిశీలకులు. పదే పదే స్క్రిప్టు వైపు చూడడం.. తడబడడం.. ముఖంలో ఎలాంటి స్పందనా లేకపోవడం.. ఇలా.. అనేక అంశాలు స్పష్టంగా కనిపించాయని అంటున్నారు. మరి.. ఏం జరిగింది? తెరవెనుక జరిగిన రాజకీయం ఏంటి? అనేది ఆసక్తిగా మారింది.
Comments 1