కరోనా కారణంగా గత ఏడాది ఐపీఎల్ సీజన్ మొత్తం దుబాయ్ కే పరిమితమైంది. వ్యాక్సిన్ రావటం.. అంతో ఇంతో సాధారణ పరిస్థితులు చోటు చేసుకుంటున్న వేళ.. ఈసారి సీజన్ ను ఎక్కడ నిర్ణయించాలన్న అంశంపై బీసీసీఐ ఇప్పటివరకు దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ప్లాన్ చేశారు. అయితే.. కరోనా సెకండ్ వేవ్ మహారాష్ట్రలో తీవ్రంగా ఉండటం.. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుందనన అంచనాలు వ్యక్తమవుతున్నాయి.ఇలాంటివేళ.. ఐపీఎల్ సీజన్ ను ఎక్కడ నిర్వహించాలన్నది బీసీసీఐ ముందున్న ప్రశ్న.
దీనికి సమాధానంగా వారు దేశంలోని మరికొన్నినగరాల మీద ఫోకస్ చేశారు. వారు షార్ట్ లిస్టు చేసిన నగరాల్లో హైదరాబాద్.. బెంగళూరు.. .కోల్ కతా నగరాల్ని షార్ట్ లిస్టు చేశారు. ప్లే ఆఫ్.. ఫైనల్ మ్యాచుల్ని అహ్మదాబాద్‌లోనే జరగనున్నాయి. దీంతో.. మిగిలిన మ్యాచుల్నిఎక్కడ నిర్వహించాలన్న దానిపై బీసీసీఐ చర్చలు జరుపుతోంది.ఇదిలా ఉంటే.. ఈ ఇష్యూలోకి ఎంటర్ అయ్యారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. రానున్న ఐపీఎల్ ను హైదరాబాద్ లో నిర్వహించాలని కోరారు. హైదరాబాద్ లోనే ఎందుకు నిర్వహించాలన్న దానికి ఆయన క్లారిటీ ఇచ్చారు.
దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే.. కోవిడ్ కేసులు భాగ్యనగరంలోనే తక్కువగా ఉన్నాయని.. అందుకే తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఒకవేళ ఐపీఎల్ ను హైదరాబాద్ లో నిర్వహిస్తే.. అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. మరి.. కేటీఆర్ ఇంతలా నోరు తెరిచి అడిగిన తర్వాత బీసీసీఐ హైదరాబాద్ కు ప్రయారిటీ ఇస్తుందా? లేదా? అన్నది కాలమే తేల్చాలి. కేటీఆర్ ట్వీట్ రిక్వెస్టుకు బీసీసీఐ కానీ ఓకే చెబితే.. హైదరాబాదీయులకు పండుగేనని చెప్పక తప్పదు.