ఒకప్పుడు ఛార్జీలు పెంచుతాడు అని చంద్రబాబుకు ఒక ముద్ర ఉండేది
కానీ జగన్ ని చూశాక చంద్రబాబును ఆ విషయం పిపీలికం అంటున్నారు
ఛార్జీలు పెంచడంలో చంద్రబాబు ఒక పిట్టగోడ అయితే… జగన్ ఒక ఎవరెస్టు అంటున్నారు.
రూపాయి రెండు రూపాయలు పెంచడానికి అందరూ ఆలోచిస్తారు. కానీ జగన్ 200 శాతం కూడా క్షణాల్లో పెంచేసి సమర్థించుకోగలిగిన ఘనుడు.
మొన్నే రేషన్ సరుకుల ధరలను 40 శాతం పెంచిన జగన్, అంతకు ముందు కరెంటుతో జనానికి వాతలు పెట్టిన విషయం తెలిసిందే.
హిందు ఆలయాల్లో వసూలు చేసే ఫీజులపై భక్తులకు విరక్తి కలిగించేలా అద్దె గదులు, పార్కింగ్ ఫీజు చివరకు తిరుమల లడ్డూ రేటును కూడా డబుల్ చేసిన జగన్ ప్రభుత్వం తాజాగా తిరుమల టోల్ ఫీజును 300 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నాడు.
కారుకు రూ.15 నుంచి రూ.50, మినీ బస్సు, మినీ లారీకి రూ.50 నుంచి రూ.100కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఇక నుంచి తిరుమలకు వెళ్లాలంటే టోల్ ఫీజు 300 శాతం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.