పవిత్ర లోకేష్ – నరేష్ సహజీవనం … ఎంత వివాదాస్పదం అయ్యిందో అందరదికీ తెలిసిందే. ఈ ఘటనతో ఒకరి పరువు ఒకరు తీసుకున్నారు. నరేష్ భార్య రమ్య రఘుపతి నరేష్ పవిత్ర దంపతులపై చెప్పులేసిన ఘటన వైరల్ అయ్యింది.
తొలుత తను మరియు నరేష్ మంచి స్నేహితులు మాత్రమే కానీ మా మధ్య ఏమీ లేదని చెప్పిన పవిత్ర తర్వాత ఇద్దరు ఒకే హోటల్లో బస చేస్తూ పట్టుబడటంతో రమ్య తో వివాదం మరింత ముదిరింది. మొత్తం వ్యవహారం కొన్ని వారాలుగా వైలర్ అవుతోంది.
ఈ వివాదం పవిత్ర కెరీర్ పై ప్రభావం చూపింది. గత రెండు రోజులుగా, భారీ స్టార్ కాస్ట్ ఉన్న రెండు పెద్ద సినిమాలు, పవిత్ర లోకేష్‌ను ఈ సినిమాలో తల్లి పాత్ర నుంచి తీసేశాయి.
ఈ వివాదం తర్వాత ప్రముఖ హీరోలకు ఆమెను తల్లిపాత్రలో చూస్తే ప్రేక్షకుడు కనెక్ట్ కాడని ఆమె తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. సినీ పరిశ్రమలో చాలా మంది తమ వ్యక్తిగత విషయాలను చాలా గోప్యంగా ఉంచడానికి కారణం కూడా అదే.