ఏపీలో పరిస్థితులుపై మళ్లీ ఉండవల్లి ప్రెస్ మీట్ పెట్టారు
ఏపీ ఆర్థిక పరిస్థితి భ్రష్టుపట్టి పోయిందన్నారు.
ఖజానా మొత్తం క్రమ శిక్షణ లేక దివాలా తీసిందన్నారు.
రాష్ట్రం ఏమైపోయినా… జీతాలు ఇవ్వలేకపోయినా జగన్ ఎందుకు పథకాలు పంచుతున్నాడు అన్నదానికి ఉండవల్లి సమాధానం చెప్పారు.
జగన్ సిసలైన వ్యాపారి. అతను లాభాపేక్ష లేకుండా ఏమీ చేయడు. ఈరోజు పథకాల పేరుతో డబ్బులు పంచుతున్నాడు. అవి ఎక్కడో ఒకచోట నుంచి లాగాలి కదా లాగుతున్నాడు. ఇదో పెద్ద గాంబ్లింగ్. గతంలో ఎవరూ చేయలేదు కాబట్టి సక్సెస్ అవుతుందా? ఫెయిల్ అవుతుందా? చెప్పలేం. ఎలక్షన్ వస్తే తెలుస్తుంది అన్నాడు ఉండవల్లి.
తన రాజకీయ ప్రయోజనమైన ఓటు గెలవడంలో జగన్ ఏమీ పట్టించుకోకుండా చేసుకుంటూ పోతున్న కొన్ని పనుల వల్ల ఏపీ చాలా నష్టపోయిందన్నారు. కరెంటు కోతలు, అధ్వాన రోడ్లు, వరుస ఛార్జీల పెంపు… ఏమిటిదంతా అని ఉండవల్లి అన్నాడు.