యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య గత కొద్ది నెలల క్రితమే ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య సమంత నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే.
గోవా వేదికగా పెద్దల సమక్షంలో ఒకటైన ఈ జంట.. పెళ్లై నాలుగేళ్లు గడవక ముందే తమ వైవాహిక జీవితానికి పులిస్టాప్ పెట్టేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ప్రస్తుతం కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టిన నాగ చైతన్యకు.. ఇప్పుడో కొత్త తలనొప్పి మొదలైందట. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
`లవ్ స్టోరీ` వంటి బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న నాగ చైతన్య.. ఆ తర్వాత విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో `థ్యాంక్యూ` అనే సినిమాను స్టార్ట్ చేశాడు.
ఇందులో రాశీ ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెకంటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందిస్తున్నాడు.
ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేశ్ బాబుకు వీరాభిమానిగా చైతు కనిపించబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ.. విడుదలకు నోచుకోవడం లేదు.
థ్యాంక్యూ చిత్రీకరణ పూర్తైన వెంటనే చైతు చేసిన `బంగార్రాజు` చిత్రం సంక్రాంతికే విడుదలై మంచి విజయం సాధించింది. కానీ, థ్యాంక్యూ మాత్రం ప్రేక్షకుల ముందుకు రావడం లేదు.
ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ సైతం రాకపోవడంతో.. చైతు అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర టాక్ బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు సరిగ్గా రాకపోవడం వల్ల డైరెక్టర్ విక్రమ్ రీ షూట్ చేయాలని పట్టుబట్టాడట. ఇదే ఇప్పుడు చైతుకు సమస్యగా మారిందట.
తన అప్ కమ్మింగ్ ప్రాజెక్ట్స్ కోసం చైతు డైట్స్ అడ్జస్ట్ చేసుకుని పక్కా ప్లానింగ్ తో ఉన్నాడట. ఇలాంటి తరుణంలో విక్రమ్ రీ షూట్ అనడంతో.. ఆయన ప్లానింగ్ మొత్తం తారుమారు అవుతుందట.
పైగా రీ షూట్ వల్ల బడ్జెట్ కూడా భారీగా పెరిగే అవకాశాలు ఉండటంతో నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారని నెట్టింట టాక్ నడుస్తోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.