“నేను సీబీఎన్ దత్తపుత్రుడ్ని అయితే మీరు సీబీఐ దత్తపుత్రులు” అంటూ వైసీపీని ముఖ్యంగా ఆ పార్టీ అధినేత జగన్ ను ఉద్దేశించి పవన్ కల్యాణ్ సెటైర్లు వేశారు. మీ నాయకులందరిలో కొందరిని ఏదో ఒక రోజు చాలా ప్రేమగా సీబీఐ దత్తత తీసుకునే రోజు చాలా దగ్గరలోనే ఉంది అని అన్నారు. అనంతపురం జిల్లాలో ఇవాళ ఆయన కౌలు రైతు భరోసా యాత్రను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సందర్భం వచ్చిన ప్రతిసారీ తమ పార్టీని టీడీపీ బీ టీం అని అంటున్నారు అని, మీరు మరోసారి ఇలా అంటే తాను చర్లపల్లి జైలు షటిల్ టీం అనాల్సి వస్తుందని అన్నారు. సత్యం మాట్లాడేవాడు లోక విరోధి అంటారని, ఆ విధంగా తాను నిజాలనే మాట్లాడతానని, వైసీపీ నాయకులు ఎన్ని తిట్టినా భరిస్తానని అన్నారు. వైసీపీ నాయకులు స్వాతంత్ర్య సమరయోధుల మాదిరి మాట్లాడతారని, ఏదయినా అంటే విరుచుకుపడతారు, భయపెడతారు అని ఎద్దేవా చేశారు.
తనకు భయం అంటే తెలియదు అని, దెబ్బ పడే కొద్ది రాటుదేలుతానని అన్నారు. అదేవిధంగా ఇదే సభలో పోలీసుల కష్టాల గురించి వారి సమస్యల గురించి ప్రస్తావించారు. వైసీపీ ప్రభుత్వం వారిని వాడుకుని వదిలేస్తుందని చెప్పారు. వారికి సరెండర్ లీవుల మంజూరులో కానీ, ఎడిషనల్ సరెండర్ లీవుల మంజూరులో కానీ, ట్రావెల్ ఎలవెన్సుల చెల్లింపులో కానీ, అదేవిధంగా వారికి కావాల్సిన వేతనాలు ఇవ్వాలని, వారికి సెలవులు లేకుండా చేయడం తగదని ఆవేదన చెందుతూ వీరి సమస్యలపై సానుకూల పరిష్కారం చూపాలని ప్రభుత్వానికి విన్నవించారు.
అదేవిధంగా ఇక్కడున్న యువతకు ఉపాధి అవకాశాలు చూపాలని, అటువంటప్పుడు వలసలు ఉండవని, అందుకే అనంతపురం జిల్లాను బలయమైన ఇండస్ట్రియల్ కారిడార్ చేయాలని ఆ దిశగా తాము అడుగులు వేస్తున్నామని అన్నారు.
Anna @PawanKalyan ❤️???? #JanaSenaRythuBharosaYatra pic.twitter.com/mnMgEo7BpC
— Admire Senani (@admiresenani) April 12, 2022