“నా వెంట్రుక కూడా పీకలేరు” అని జగన్ మోహన్ రెడ్డి పరోక్షంగా హెచ్చరించినప్పటికీ వెనక్కి తగ్గని తాజా మాజీ మంత్రులు మరియు వైఎస్సార్సీపీ సీనియర్ ఎమ్మెల్యేలు
తీవ్ర ఒత్తిడిలో సీనియర్ మంత్రుల హెచ్చరికలకు తలవంచిన సీఎం జగన్
పాత మంత్రులను ఒకరిద్దరిని మినహాయించి అందరినీ మారుస్తానని చెప్పినప్పటికీ మంత్రుల బ్లాక్మెయిల్ కు లొంగి తప్పక తలవంచి 11 మందిని కొనసాగింపు
దీనితో ఇప్పటివరకు మంత్రి పదవి ఆశించి భంగపడ్డ సీనియర్లు తీవ్ర అసంతృప్తి
వైఎస్సార్సీపీ ఆవిర్భావం తరువాత మొట్టమొదటసారిగా తీవ్ర స్థాయి నిరసన సెగ రుచి చూసిన జగన్
ఏకంగా రాజీనామాలకు సిద్ధమైన మంత్రులు..ఇప్పటికే రాజీనామా సమర్పించిన మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత. సుచరిత బాటలో మరికొందరు ఎమ్మెల్యేలు
భంగపడ్డ ఎమ్మెల్యేల అనుచరులు రొడ్లెక్కి జగన్ కు వైసీపీ కు వ్యతిరేఖంగా నినాదాలు. పలుచోట్ల ముఖ్యమంత్రి దిష్టి బొమ్మలు దగ్ధం.
మంత్రి వర్గం నుండి పూర్తిగా మాయమైన కమ్మ, వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ కులాలు. కుల సంఘాలలో మొహం చెల్లక లోలోపల రగిలిపోతున్న ఆయా సామాజిక వర్గాల ఎమ్మెల్యేలు
నిరసనకారులను బుజ్జగించి తన వద్దకు తీసుకురావాల్సిందిగా పార్టీ ముఖ్య నేతలను ఆదేశించిన జగన్
ఇక వివరాల్లోకి వెళితే
మంత్రివర్గ మార్పు పేరుతో జగన్ చీమల పుట్టలో వేలు పెట్టినట్లు అయ్యింది.
ముందుగా జగన్ 25 మంది మంత్రులతో రాజీనామా చేయించారు. అక్కడ వరకు అంతా బాగానే జరిగింది.
ఒకరిద్దరు మినహాయించి కేబినెట్ అంత కొత్త వారితో ఉంటుంది అన్నప్పుడు కూడా పరిస్థితులు జగన్ కంట్రోల్ లోనే ఉన్నాయి.
మంత్రులు రాజీనామా చేసిన మూడో రోజు ప్రకాశం జిల్లాలో మంత్రి ఆదిమూలపు సురేష్ ను పదవిలో కొనసాగించే అవకాశం ఉంది అన్న లీక్ తో అదే జిల్లాకు చెందిన మరో మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి రగిలిపోయాడు. బహిరంగంగానే సురేష్ కు మంత్రి పదవిలో కొనసాగిస్తే తనను కూడా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఇదే తంతు పక్క జిల్లాలకు పాకి మంత్రివర్గ విస్తరణ గందరగోళంగా చిలికి చిలికి గాలి వాన అయి పరిస్థితులు జగన్ చేయి దాటిపోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు
సీనియర్లు అందరూ కూడా మీడియా తో “జగన్ మాటే మా మాట. పదవి ఇచ్చేటపుడే రెండున్నరేళ్ల అని చెప్పాడు” కాబట్టి మేము సహకరిస్తున్నామని చిలక పలుకులు పలికి అంతర్గతంగా వారి అసంతృప్తి వ్యక్తపరిచి అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేయడంతో ఈ మూడేళ్లు మోనార్క్ లా వ్యవహరించిన జగన్ ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ ఒక్కసారిగ పీక్స్ కి చేరిపోయాయి. ఇన్నాళ్లు తన మాటకు పార్టీలో ఎదురు చెప్పని నేతలను మాత్రమే చూసిన జగన్ పార్టీ ఆవిర్భవించిన తొలిసారి పార్టీ లీడర్ల నుండి ఇంతటి నిరసన సెగలు రుచి చూసి వారందరినీ కంట్రోల్ లోకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో నంద్యాల పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రతిపక్షాలను అడ్డం పెట్టుకుని స్వపక్షంలోని కొందరు సీనియర్లకు తగిలేలా “నా వెంట్రుక కూడా పీకలేరు” అని సీనియర్ల హెచ్చరికలకు ఘాటుగా సమాధానం చెప్పాడు జగన్.
అందరూ ప్రతిపక్షం, పవన్, మీడియా ను జగన్ ఆ మాట అన్నాడు అనుకున్నారు కానీ వైసీపీ అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేసిన వైసీపీ సీనియర్లకు క్లియర్ గా ఆ మాట సీఎం జగన్ అనింది ఎవరినో అర్థమయ్యింది. అయినప్పటికీ వారు తగ్గేదెలే అనే సినిమా డైలాగ్ ను ఆదర్శంగా తీసుకుని జగన్ పై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు.
రాజీనామా రోజు ఒకరిద్దరికి తప్ప అందరూ కొత్త వారే ఉంటారన్న జగన్ సరిగా కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి మూడురోజుల ముందు తీవ్ర ఒత్తిడి చేస్తున్న నలుగురు సీనియర్ నాయకుల హెచ్చరికలకు లొంగీ “నలుగురు పాత వారికి మళ్ళీ అవకాశం” అనే విషయం వారి అనుకూల మీడియా నుండి లీక్ ఇచ్చారు. దీనితో ఆ నలుగురు ఎవరో స్పష్టత రావడంతో మిగిలిన సీనియర్లు తీవ్రంగా రగిలిపోవడం తో దిక్కుతోచని జగన్ మళ్లీ మంత్రివర్గం పై కసరత్తు మొదలుపెట్టారు.
తప్పనిసరి పరిస్థితులలో 10 మంది తాజా మాజీ మంత్రులను మళ్ళీ కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
ప్రమాణ స్వీకారానికి ఒక్కరోజు ముందు 10 మంది పాత మంత్రులు కొనసాగుతారు అనే వార్త బయటకి రావడం తో జగన్ పూర్తిగా సీనియర్ల హెచ్చరికలకు లొంగిపోయారు అని తేటతెల్లమయ్యింది.
ఆ 10 మంది పాత వారి పేర్ల పై స్పష్టత రావడంతో పాత మంత్రివర్గం లో సీనియర్లు అయిన కొందరు తీవ్ర అసంతృప్తి తో రగిలిపోయారు. ఇక కొత్తగా మంత్రి పదవులు ఆశించిన సీనియర్లు కూడా తీవ్ర అసంతృప్తితో ఉండగా వారి అనుచరులు రోడ్డెక్కి జగన్ మోహన్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేయడం చూస్తే ఏ స్థాయిలో అసంతృప్తి ఉందో అర్ధమయిపోతుంది.
తాజా మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత ఇప్పటికే తన పదవికి రాజీనామా చేసి బుజ్జగించే ప్రయత్నం చేసిన ఎంపి మోపిదేవి కి తన రాజీనామా పత్రం ఇచ్చారు. సుచరిత ఆవేదనలో అర్థం ఉంది. వైఎస్ఆర్ మరణించినపుడు సుచరిత ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు. వైఎస్ఆర్ మరణానంతరం జగన్ కోసం రాజీనామా చేసిన మొట్టమొదటి బ్యాచ్ లో సుచరిత కూడా ఒకరు. ఇక పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వైఎస్సార్ మరణించేటప్పటికి మంత్రిగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి మరణానంతరం జరిగిన పరిణామాలలో మంత్రి పదవి వదులుకోకుండా పదవి కాలం మొత్తం అనుభవించి 2014 లో వైసీపీ లో చేరిన వ్యక్తి పెద్దిరెడ్డి. అట్లాంటి పెద్దిరెడ్డి ని పదవిలో రెడ్డి కాబట్టి కొనసాగిస్తూ తను ఎస్సీ కాబట్టి తొలగించారు అనే ఆవేదనలో సుచరిత రాజీనామా చేశారు.
అదే మాటకు వస్తె బాలినేని శ్రీనివాస రెడ్డి వైఎస్ఆర్ మరణించేటప్పటికి మంత్రిగా ఉన్నారు. వైఎస్ఆర్ మరణానంతరం మంత్రి పదవికి రాజీనామా చేసిమరి జగన్ వెంట నడిచారు. అట్లాంటి తనను కొనసాగించకుండా వైఎస్ఆర్ మరణానంతరం కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ లో మంత్రి పదవులు అనుభవించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ ను కొనసాగే అవకాశం ఇవ్వడం ఎంతవరకు న్యాయం అని ప్రశ్నిస్తున్నారు. మంత్రి పదవి విషయంలో జగన్ చేసిన మోసం తట్టుకోలేక పోతున్నాను అని తీవ్ర ఆవేదను వ్యక్తం చేస్తున్నారు.
పల్నాడు జిల్లా సీనియర్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణరెడ్డి అనుచరవర్గం లోని కౌన్సిలర్ల సర్పంచులు రాజీనామా దిశగా ప్రకటన చేశారు. అదే బాటలో నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరులు కూడా రాజీనామా అనే పదం వాడడం వైసీపీ అధిష్ఠానానికి మింగుడు పడడం లేదు.ఇదే పరిస్థితి నెల్లూరులో కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరులతో నెలకుంది.
ఇక కమ్మ సామాజిక వర్గం నుండి వసంత కృష్ణప్రసాద్ పేరు వినిపించినప్పటికీ ఫైనల్ లిస్ట్ లో ప్లేస్ దక్కలేదు. కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉండే NTR జిల్లా నుండి ఖచ్చితంగా వసంత కృష్ణప్రసాద్ కు మంత్రి పదవి ఖాయం అనుకున్నప్పటికి ఆ జిల్ల నుండి కమ్మ కే కాదు ఎవ్వరికీ మంత్రి పదవి దక్కలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1956లో ఏర్పడింది. నేటికీ 66 సంవత్సరాలు. ఈ 66 సంవత్సరాల కాలంలో కమ్మ ప్రాతినిధ్యం లేని మొట్టమొదటి కాబినెట్ గా జగన్ రెడ్డి ఏప్రిల్ 11 న ఏర్పాటు చేసే కాబినెట్ కాబోతుంది. దీనితో ఆ పార్టీ లో ఉన్న కమ్మ నాయకులు కక్కలేక మింగలేక ఎవరికి చెప్పుకోవాలో తెలియక బిక్క మొహాలు వేశారు. ఇక వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ కులాలను కూడా జగన్ రెడ్డి విస్మరించారు.
చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజినీ పట్ల అధిష్టానం సానుకూలంగా ఉన్నప్పటికీ సొంత సామాజిక వర్గం రాష్ట్ర ఐక్య వేదిక ఇప్పటికే రజీనికి మంత్రి పదవి ఇవ్వొద్దని సీఎం జగన్ కు లేఖ రాశారు. చిలకలూరిపేట వైసీపీ కార్యకర్తలు కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని రజినికి మంత్రి పదవి ఇవ్వొద్దని బహిరంగంగానే సీఎం జగన్ కు విజ్ఞప్తి చేశారు….అయినప్పటికీ విడదల రజినీ పేరు మంత్రివర్గ లిస్ట్ లో రావడం తో ఆ పార్టీ లోని ఆమె వ్యతిరేఖ వర్గం అసంతృప్తి గా ఉంది. రజినీకి రజకుల కోటాలో మంత్రి వర్గం లో స్థానం కల్పించడానికి మేము వ్యతిరేకిస్తున్నామని బహిరంగ లేఖ రాసిన రజక సామాజిక వర్గ పెద్దలకు సాక్షి టీవీ షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు రజినీ రజక సామాజిక వర్గం అనుకున్న వారంతా కూడా సాక్షి టీవీ లో రజినీ ముదిరాజ్ కులం అని ప్రచురించడంతో షాక్ అయ్యారు…మొత్తానికి తెలుగుదేశం పార్టీ ఎంతో పవిత్రంగా భావించే మహానాడు వేదిక గా తన రాజకీయ అరంగ్రేటం, మొట్టమొదటి రాజకీయ ఉపన్యాసం ప్రారంభించిన విడదల రజినీ తరువాత వైసీపీ లోకి వెళ్లి కమ్మ సామాజిక వర్గానికి చెందిన మర్రి రాజశేఖర్ సీట్ దక్కించుకుని మంత్రి అయిపోయారు.రజినీ ని గెలిపిస్తే M MLC ఇచ్చి మంత్రిని చేస్తాను అని హామీ తీసుకున్న మర్రి రాజశేఖర్ జగన్ చేతిలో మోసపోయారు.
అంబటి రాంబాబు. ఇతగాడి పై అనేక లైంగిక ఆరోపణలు వచ్చినప్పటికీ, కాపుల గురించి ఒక ఛానల్ ఇంటర్వ్యూలో అత్యంత అవమానకరంగా మాట్లాడినందుకు గాను అసెంబ్లీలో తప్పుడు కూతలు కుసినందుకు గాను జగన్ మనసు దోచి మంత్రి అయిపోయారు.
ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఓ 20 మంది ఆశావాహులు జగన్ మోహన్ రెడ్డి కి వ్యతిరేఖంగా మొట్టమొదటి సారి అసంతృప్తి వ్యక్తం చేసి పులివెందుల పులి అని చెప్పుకు తిరిగే జగన్ రెడ్డి కి April 10వ తారీఖు పట్టపగలే చుక్కలు చూపించారు.
ఇంత తీవ్రంగా అసంతృప్తి నిరసన జ్వాలలకు కారణం ఏంటో ఆలోచిస్తే ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఆశావాహులు అంత కూడా రోజు ప్రజలలో వైఎస్సార్సీపీ పై వస్తున్న వ్యతిరేకతను గమనించి 2024 లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాదు, వైఎస్సార్సీపీ కి ఇదే ఆఖరి ఛాన్స్. ఇప్పుడు మంత్రి అవకపోతె ఇంకెప్పటికి అవలేము అనే ఒక లోతైన ఆలోచనే ఇంతటి అసంతృప్తికి నిరసనలకు గల కారణం
రాష్ట్రవ్యాప్తంగా ఈ మంత్రివర్గ విస్తరణ పెట్టిన చిచ్చు చిలికి చిలికి గాలి వానగా మారి జగన్ మోహన్ రెడ్డి కి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టి నా వెంట్రుక కూడా పీకలెరు ఆన్న జగన్ రెడ్డి త్వరలోనే తన సొంత ఎమ్మెల్యేల చేతనే పదవి పీకించుకోబోతున్నడు అని అర్థం అవుతుంది