మెగా స్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `ఆచార్య`. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషించగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు.
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిరంజన్‌రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ స్వరాలు సమకూర్చారు.
ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో చిరంజీవి, రామ్ చరణ్‌లు నక్సలైట్స్‌గా కనిపించబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా గత ఏడాది మే నెలలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, మాయదారి కరోనా వైరస్ కారణంగా వాయిదా పడుతూ పడుతూ వస్తోంది. ఇక ఎట్టకేలకు ఈ మూవీని ఏప్రిల్ 29న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్, పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేయగా.. చిరు, చరణ్‌లను ఎప్పుడెప్పుడు ఒకే స్క్రీన్‌పై చూద్దామా అని మెగా అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆచార్య గురించి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. అదే రన్ టైమ్. దేవాలయ భూముల కుంభకోణం నేపథ్యంలో సందేశాత్మక కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు మేకర్స్ మూడు గంటల రన్ టైమ్‌ను టాక్ చేశారట.
రఫ్ కటింగ్ తర్వాత వచ్చిన అవుట్ పుట్‌ను ఏం మార్చకుండా లెంగ్తీ రన్ టైంతో సినిమాను రిలీజ్ చేయాలని కొరటాల భావిస్తున్నారట. ఇందుకు చిరు కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారట. దీంతో ఇప్పుడీ విషయం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే, కంటెంట్ ఎంత ఉన్నా.. సినిమా క్రిస్పీగా ఉంటేనే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారన్న టాక్ ఉంది. నిడివి ఏ మాత్రం ఎక్కువైనా బోరింగ్ గా ఫీలవుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆచార్యను ఆడియెన్స్ అంతసేపు చూడగలరా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా మూడు గంటల రన్ టైమ్ అంటే చిరు రిస్క్ చేస్తున్నట్లే. విడుదల తర్వాత రిజల్ట్‌లో ఏ మాత్రం తేడా వచ్చినా ఇక అంతే సంగతులని చెప్పాలి.