హైదరాబాద్‌లోని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయంలో దొంగతనం జరిగింది. నిజానికి అత్యంత కీలక పరిణామాల నేపథ్యంలో అసోసియేషన్ అధ్యక్ష బాద్యతలు చేపట్టిన మంచు మోహన్ బాబు కుమారుడు విష్ణు.. కార్యాలయంపై డేగకన్ను సారించారు. గట్టి భద్రతను ఏర్పాటు చేసుకున్నారు. గతంలో ఉన్న సీసీ కెమెరాలను మార్చేశారు. భద్రతా సిబ్బందిని మార్చడంతోపాటు.. వీరి సంఖ్యను కూడా రెట్టింపు చేసుకున్నారు. అయినప్పటికీ.. ఆయన కార్యాలయంలోనే దొంగత నం జరగడం సంచలనంగా మారింది.
‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కార్యాలయంలో చోరీ జరిగింది. ఫిల్మ్‌నగర్‌లోని మూవీ అర్టిస్ట్ అసోసియేషన్ (మా) కార్యాలయంలో విలువైన సామాగ్రి కనిపించ కుండా పోయింది. విషయ తెలిసిన వెంటనే మా అధ్యక్షుడు మంచు విష్ణు వెంటనే స్పందించారు. దొంగతనం ఎలా జరిగిందనే విషయంపై ఆరా తీశారు. వెంటనే ఆయన తన మేనేజర్ సంజయ్ ద్వారా జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయించారు. దీంతో ఈ విషయం బయటపడింది. ప్రస్తుతం కేసు నమోదు చేసిన పోలీసులు దొంగతనంపై దృష్టి పెట్టారు.
మా కార్యాలయంలో రూ. 5 లక్షల విలువ చేసే హెయిర్ డ్రెస్పింగ్ సామాగ్రిని దుండగులు దొంగలించి నట్లు మేనేజర్ సంజయ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే దొంగతనం జరిగినప్పటి నుంచి హెయిర్ డ్రెస్సర్ నాగ శ్రీను కనిపించడం లేదని, ఈ చోరీ వెనక అతడి హస్తం ఉండోచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు.. మరో ఇద్దరు అనుమానితులపైనా సందేహం వ్యక్తం చేశారు. గతం ఉన్న వారి పాత్రపైనా అనుమానం ఉందన్నారు. ఈ సంఘటనపై ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు మీడియాతో మాట్లాడక పోయినా.. ఈ దొంగతనం వెనుక ఉద్దేశ పూర్వక చర్యలు ఉండి ఉంటాయని.. తన అనుచరుల వద్ద.. వాపోయినట్టు తెలిసింది.
ఇక, ఈ విషయం తెలిసిన వెంటనే మాజీ అధ్యక్షుడు.. నరేష్ కూడా.. మా కార్యాలయానికి చేరుకుని.. ఏం జరిగిందనే విషయంపై ఆరా తీశారు. పోలీసులు తక్షణమే దొంగ ను పట్టుకోవాలని.. ఆయన కోరారు. దీని వెనుక.. మాజీ సభ్యుల హస్తాన్ని ఆయన అనుమానించడం విశేషం. తమపై ఆది నుంచి ఇష్టం లేని శక్తులే.. ఇలా ప్రోత్సహించి.. మాకు చెడ్డపేరు తెచ్చేందుకు ఇలా చేసి ఉంటారని.. ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.