అధికారంలో ఉన్న పార్టీ చెప్పిన మాట వినడం పోలీసులకు అలవాటు.
కానీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తప్పు ఎవరివైపు ఉన్నా కేసులు ప్రతిపక్షాల మీదే పెట్టేలా ఏపీ పోలీసులు ప్రవర్తిస్తున్నారని అనేక సార్లు ఆరోపణలు వచ్చాయి.
డీజీపీ కూడా పలుమార్లు కోర్టు బోనెక్కారు.
పోలీసులు ఇంతగా వైసీపీకి జీహుజూర్ అన్నా కూడా పోలీసులను వైసీపీ నేతలు ఇంకా నీచంగా చూస్తున్నారు.
తాజాగా కృష్ణా జిల్లా వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి విరుచుకుపడ్డారు. పోలీసులు బ్రోకర్లు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఉయ్యూరు టౌన్ పోలీసులపై ముఖ్యంగా ఎస్ఐపై కేసులు పెట్టాలని వైసీపీ కార్యకర్తలకు ఆయన ఆదేశించారు. అంతేకాదు తాను కూడా ఎస్ఐ, ఏఎస్ఐ లపై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్లో ఫిర్యాదు చేశారు.
ఏఎస్ఐ సిటీ కమిషనరేట్ పరిధిలో ఉండకూడదని, అతనిపై చర్యలు తీసుకుని బదిలీ చేయాలని హోమ్ మినిస్టర్ కు ఫిర్యాదు చేస్తామని బహిరంగంగా హెచ్చరించారు.
టీడీపీ, వైసీపీ కార్యకర్తలు గొడవ పడిన నేపథ్యంలో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో వైసీపీ శ్రేణలపై ఎందుకు కేసులు పెడతారు అని ఆగ్రహించిన ఎమ్మెల్యే ఏకంగా వారిని పోలీసులు కొట్టారని ఆరోపిస్తున్నారు. పోలీసులు ఉన్నది ఎదుటి వారిపై పగ తీర్చుకోవడానికి కాదు అని వైసీపీ వాళ్లకి ఎపుడు అర్థమవుతుంది?