నందమూరి బాలకృష్ణ యొక్క అన్స్టాపబుల్ షో ఆహాలో ప్రసారం అవుతోంది, ఇది అందరికీ తెలిసిన విషయమే.
ఈ షోకి టాప్-క్లాస్ రెస్పాన్స్ వచ్చింది. బాలకృష్ణ హోస్టింగ్ ప్రేక్షకులకు బాగా నచ్చుతోంది.
ఏ అనుభవం లేకుండా హోస్ట్ గా బాలకృష్ణ సక్సెస్ కావడంలో ఆయన నిజాయితీతో కూడా ప్రవర్తనే కారణం అంటున్నారు విశ్లేషకులు.
తాజాగా రాజమౌళి ఈ షోకు గెస్ట్. దీంతో ఆసక్తి ఇంకా పెరిగిపోయింది. శనివారం ఈ ఎపిసోడ్ ప్రసారమైంది. బాలకృష్ణ, రాజమౌళి మధ్య సాగిన సంభాషణ ఆసక్తికరంగా ఉంది.
నా అభిమానులు మిమ్మల్ని బాలయ్యతో సినిమా ఎప్పుడు చేస్తారు అని అడిగితే మీరు నన్ను హ్యాండిల్ చేయలేను అన్నారట, అలా ఎందుకు అన్నారు అని రాజమౌళిని నేరుగా అడిగాడు బాలకృష్ణ.
దీనికి రాజమౌళి ఏం చెప్పాడో తెలుసా?
. ‘‘అవును, నేను అలానే అన్నాను. నిజంగా భయంతోనే ఆ మాటన్నాను. దీనికి ఒక కారణం ఉంది. చిన్న వాళ్ల దగ్గరి నుంచి పెద్ద వాళ్ల వరకూ మీరు అందరికీ గౌరవం ఇస్తారు. చాలా పద్ధతిగా ఉంటారు. నేను సినిమా షూటింగ్ చేసేటప్పుడు ఎలా ఉంటానో నాకు తెలియదు. షాట్ పెట్టుకుని పక్కన హీరో ఎండలో నిలబడ్డాడా? వానలో నిలబడ్డాడా? అన్నది చూడను. నేను పట్టించుకోను. నా ఫ్రేమ్ రెడీ అయ్యే వరకూ హీరో కష్ట సుఖాలు ఆలోచించలేను. ఒక వేళ మిమ్మల్ని డైరెక్ట్ చేయాల్సి వస్తే, నా బిహేవియర్ వల్ల మీకేమైనా కోపం వస్తుందేమోనని భయం. నాకు అదే టెన్షన్’’ అని రాజమౌళి వివరించాడు.
రాజమౌళి స్పందన బాలయ్య అభిమానులకు బాగా నచ్చింది. అయితే… బాలయ్య దానికి ఏం చెప్పాడంటే…
నేను ఒకసారి క్యారావ్యాన్లోని నుంచి బయటకొస్తే… షూటింగ్ అయ్యే వరకూ మళ్లీ ఆ రోజు లోపలకి వెళ్లను. గొడుగు కింద ఉండను అన్నారు బాలయ్య.
https://twitter.com/Fizzy__022/status/1472235716759326733