చిత్తూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తాయని ముందే తెలిసినా.. ప్రభుత్వం ఏం చేసిందని అన్నారు.
ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇంత నష్టం కలిగేదా ? అని ప్రశ్నించారు. ఎవరూ అధైర్యపడవద్దు.. టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. వరదలతో ప్రజలు ఇబ్బందిపడుతుంటే.. ఈ సీఎం గాలిలో తిరుగుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేకాదు.. ముఖ్యమంత్రికి ప్రజల క్షేమం కంటే.. తన పంతం నెగ్గించుకోవడమే ముఖ్యమని వ్యాఖ్యానించారు. ప్రజలు ఓ పక్క వరదలతో ఇబ్బందులు పడుతుంటే.. జగన్.. మాత్రం హైదరాబాద్‌లో విందులు వినోదాల్లో విరామం లేకుండా ఉన్నారని.. బిర్యానీలు తినేందుకు హైదరాబాద్ వెళ్లారని.. విమర్శించారు.
ఒకవైపు వరద బాధిత ప్రాంతాల్లో ప్రజలు కూడూ నీళ్లూ లేక అలమటిస్తున్నా.. ఈ ముఖ్యమంత్రికి మూడు రాజధానులపైనే ప్రేమ ఉందని.. విరుచుకుపడ్డారు.
తాను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని.. అనేక మంది ముఖ్యమంత్రులను చూశానని.. కానీ.. ఇలాంటి ముఖ్యమంత్రిని.. ఇలాంటి ఫ్యాక్షనిస్టును ఎప్పుడూ చూడలేదని అన్నారు.
ప్రజలకు మంచి చేస్తానని అంటే.. దయదలిచి ఒక్క ఛాన్స్ ఇచ్చారని.. ఇప్పుడు అరాచకం చేస్తున్నారని.. అన్నారు. ఇలాంటి వారితో మాటలు పడాల్సిన .. అవమానాలకు గురి కావాల్సిన అవసరం తనకు ఉందా? అని ప్రశ్నించారు. అయినప్పటికీ.. తాను ప్రజల కోసం.. తాను.. భరిస్తున్నానని చెప్పారు.
అంతకుముందు చంద్రబాబు తిరుపతిలోని రేణి వై కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. వరద తీవ్రతను తెలియజేసే చిత్రాలతో టీడీపీ నేతలు ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. చంద్రబాబు రాక దృష్ట్యా తిరుపతి రేణి వై కన్వెన్షన్ సెంటర్‌కు భారీగా టీడీపీ నేతలు తరలివచ్చారు. అయితే.. జిల్లా పోలీసులు సైతం భద్రతను కట్టుదిట్టం చేశారు.
నెల్లూరు జిల్లా కోవూరు ప్రజలు గత నాలుగు రోజులుగా వరద నీళ్లలోనే ఉంటూ తిండి, నీళ్లు లేక అలమటిస్తుంటే అటు ప్రభుత్వం కానీ ఇటు వైసీపీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోలేదు.తీరిగ్గా పరామర్శకు వచ్చిన కోవూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిని చూడగానే బాధితుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది pic.twitter.com/juwjW4Amo9
— Telugu Desam Party (@JaiTDP) November 23, 2021