కేసీఆర్ ఆర్థిక మూలాలపై..
కేంద్రం కన్ను
మెగా ప్రోజెక్టులపై దృష్టి
ఆస్తులు ఎంత ? ఎలా పెరిగాయ్.?
సిబిఐ, ఈడీ అధికారులతో ప్రత్యేక సమావేశం.?
ఏడేళ్ల అనుబంధం. ఇద్దరి మధ్య బెగిసింది. అందుకే కేంద్రం నీటి పవర్ ‘కట్’చేస్తూ గెజిట్. బిత్తరపోయిన గులాబీ దండు. పుండు మీద కారం చల్లినట్లు రేవంత్ రెడ్డికి టి.పిసిసి. ఇదిలా ఉండగా హుజూరాబాద్ లో ఈటల గెలవడం. రాష్ట్ర మీడియా ‘ఫిప్త్’ జండర్ లా మారిన నేపథ్యంలో ( కొందరి మినహాయింపు) కేసీఆర్ గ్రాఫ్ పడిపోయినట్లు జాతీయ మీడియా కథనాలు. వెరసి కేసీఆర్ బయటకు వచ్చాడు. జర్నలిస్టుల మీద వ్యంగ్యమాటలు లేకుండా భాజపాను టార్గెట్ చేస్తూ ఓ పత్రికా సమావేశం. నేడు ఎన్ని పత్రికలు భజన చేస్తూ కథనాలు అందిస్తాయో.. ఏ,ఏ పత్రికలు వాస్తవాలు రాస్తారో..చూపుతారో చూద్దాం. ఇక కేసీఆర్ ‘జైలు’ మాటలు మరో కోణం ఉందా.? ముందే కేసుల విషయాన్ని గమనించి ఓ ఎత్తుగడతో మాట్లాడారా..? మరో కోణంలో కేంద్రం కేసీఆర్ ఆర్థిక మూలాలను ‘దెబ్బ’ కొట్టే పనిలో పడోందా..? అంటే కేంద్ర నిఘా సంస్థలు ఇప్పటికే రంగంలోకి దిగాయని తెలుస్తోంది.
అసలేం జరిగిందంటే..:
ప్రగతి భవన్లో కేసీఆర్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్రంపై దుమ్మెత్తి పోశారు. శాపనార్థాలు పెట్టారు. మొటికలు విరిచాడు. “దమ్ముంటే అరెస్ట్ చేస్తారా..? ‘టచ్’ చేసి చూడండి” అంటూ కేసీఆర్ సవాల్ విసిరాడు. ఇందులో వింతేమిటంటే ఆదివారం ఉదయమే.. మెగా ఆంధ్రా రెడ్డి జంప్ కావడం.
కాళేశ్వరం ప్రోజెక్టు నుంచి మొదలు:
కేసీఆర్ ను కేంద్రం ఓ ఆఫర్ గా పెట్టుకుంది. రాజకీయ అవసరాల కోసం ఎత్తుగడలే లక్ష్యంగా ముందుకు వెళ్ళనున్నది. ఇందులో ప్రధానంగా ప్రాజెక్టుల విషయంలో అందిన ప్రతి ఫిర్యాదు అందుబాటులో ఉంచుకొంది. దానికి తోడు ఈ ప్రాజెక్టుల వ్యవహారం పర్యవేక్షించే మెగా రెడ్డి తన ఆర్థిక అవసరాల దృష్ట్యా ఇప్పటికే కేంద్రానికి సరెండర్ అయినట్లు తెలుస్తోంది. దీనికి తోడు టిపిసిసి రేవంత్ రెడ్డి ఇటీవల సిబిఐకి ఇచ్చిన భూ కుంభకోణం కూడా భాజపా ఉపయోగించుకోనున్నది. ఇటీవల మెగా విదేశీ ‘గిప్ట్’ రూపంలో మరో ఉచ్చు బిగియనున్నది. డ్రగ్ వ్యవహారం కూడా మరో మలుపు తిరగనున్నదని తెలుస్తోంది.
ఆస్తులు ఎలా పెరిగాయ్:
కల్వకుంట్ల ఆస్తులు ఏవిధంగా, ఎలా పెరిగాయనే విషయంలో ఇప్పటికే కేంద్ర నిఘా బృందం అత్యంత పకడ్బందీగా వివరాలు సేకరించింది. దీనికి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే జైలుకు వెళ్లిన, జైలులో ఉన్న జర్నలిస్టుల సహకారం తీసుకున్నట్లు ఓ సీనియర్ జర్నలిస్ట్ నిర్థారించారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన వేలాది కోట్ల భూదందా గురించి సమగ్ర సమాచారం కేంద్రానికి అందినట్లు తెలుస్తోంది.
రంగంలోకి ఎవరిని..?:
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన బంధువులు, బినామీలను, డొల్ల కంపెనీలను పక్కాగా గుర్తించే పని ఒక్క సిబిఐ మాత్రమే చేయగలదు. దానికి తోడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ది. విదేశీ పెట్టుబడుల వ్యవహారం కూడా ఈడీ వెలికితీయనున్నది.
భాజపా విశ్వసనీయత ఎంత.?:
గత కొద్ది నెలలుగా అనేకసార్లు బండి సంజయ్, ఎంపీ అరవింద్ లు ‘కేసీఆర్ జైలుకి వెళ్ళటం ఖాయం’ అంటూ బహిరంగ ప్రకటనలు చేయటం తెలిసిందే.! ఆ దిశలో మాత్రం ఎలాంటి అడుగులు పడలేదని తెలంగాణ సమాజం ఉంది. తెలంగాణలో భాజపాను నమ్మాలంటే కనీసం ఆయా నాయకులు చేసిన ఆరోపణలపై కేంద్రం దృష్టి పెట్టాలి. లేకుంటే భాజపాకు దూరంగా జరిగి కాంగ్రెస్ కు దగ్గరయ్యే అవకాశం ఉంది.
ఊహించని షాక్:
మెగారెడ్డి కేసీఆర్ కు ఊహించని షాక్ ఇచ్చారని తెలుస్తోంది. తన బినామీ జిఎస్టీ కేసుల నుంచి బయటపడటం కోసం హుజూరాబాద్ రూ.6వేల పంపిణీ పథకం వేసి కేసీఆర్ ని తప్పుదోవ పట్టించినట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో లక్షల కోట్ల వ్యవహారం కేంద్రంతో ఉండగా.. ఒక్క తెలంగాణ పోతే పోయిందని మెగా ఎత్తుగడ వేసినట్లు తెలిసింది.
నన్ను జైలుకి పంపిస్తారా? ముట్టి చూడు బిడ్డా! -కేసీఆర్
‘‘కేసీఆర్ను జైల్లో పెడతామని బండి సంజయ్ అంటున్నారు. కేసీఆర్ను జైలుకు పంపే దమ్ము భాజపా నేతకు ఉందా? కేసీఆర్ని టచ్ చేసి చూడు.. బతికి బట్టకడతావా? మీరు ధర్నాలు చేయడం కాదు.. రేపట్నుంచి మేం ధర్నాలు చేస్తాం. ఉత్తర భారత రైతులకు మద్దతుగా ధర్నా చేస్తాం. సాగు చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేస్తాం. కేంద్రంపై పోరాడుతున్న రైతులకు అండగా ఉంటాం. దిల్లీ భాజపా వరి వేయెద్దని అంటోంది… ఇక్కడ సిల్లీ భాజపా వరి వేయాలని చెప్తోంది. కేంద్రం వరి ధాన్యం కొంటుంటే నేను వద్దన్నానా? వరి కొంటామంటూ కేంద్రం నుంచి భాజపా నేతలు లేఖ తేవాలి. వానాకాలం ధాన్యం మొత్తం కొనే వరకు భాజపాను నిద్రపోనివ్వను.
-అనంచిన్ని వెంకటేశ్వరరావు