రెండు తెలుగు రాష్ట్రాల్లోని వారికే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువాళ్లు ఎక్కడ ఉన్నా.. ఇవాల్టి రోజున భారీగా చేసుకోవటం ఖాయం. తెలుగువారి పండుగల్లో దసరాకుప్రత్యేక స్థానం ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి పండుగ పూట తెలుగువారందరికి గుడ్ న్యూస్ చెప్పారు మెగాస్టార్ చిరంజీవి.
తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
సెప్టెంబరు పది రాత్రి స్నేహితుడ్ని కలిసేందుకు వెళ్లిన సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురి కావటం.. తీవ్ర గాయాలైన ఆయన ఆసుపత్రిలోనే ఉండడటం తెలిసిందే.
ఆయన ఆరోగ్యంపై పలు వార్తలు వినిపించినా.. ఎట్టకేలకు ఆయన క్షేమంగా.. పూర్తిస్థాయిలో కోలుకొని ఈ రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు పేర్కొన్నారు. ప్రమాదం నుంచి బయటపడిన తేజ్ కు ఇది పునర్జన్మ అని పేర్కొన్నారు.