ఇదేమీ గాసిప్ కాదండోయ్… నీ వెనుక ఉండేందుకు రెడీగా ఉన్న నా లాంటి వారిని వదిలేసి ఎక్కడెక్కడో వెతుకుతారో ఏంటో అంటూ వర్షిణి ఎదురుగానే ఆది వ్యాఖ్యానించారు. సోమవారం ప్రసారం కాబోయే అలీతో సరదాగా ప్రోగ్రాంలో వర్షిణి, హైపర్ ఆదిని కలిపి ఇంటర్వ్యూ చేశారు అలీ.
హైపర్ ఆదికి హైపర్ అనే బిరుదు ఎలా వచ్చిందని అడగ్గా… దర్శకులు పెట్టారు అంటూ దానికి కారణాలు, నేపథ్యం చెప్పుకొచ్చారు ఆది. వర్షిణి పెళ్లి చేసుకోవా అంటే… బ్యాచిలర్ గా బాగుందిగా జీవితం అంటూ మెల్లగా తప్పించుకుంది వర్షిణి. కుదరక ఎవరూ దొరకలేదు అంటే కుదిరే వాళ్లను చూసుకోవాలంటే తన వైపు చేతులు చూపుతూ వర్షిణికి హింట్ ఇచ్చాడు ఆది.
వారిద్దరు చెప్పిన బోలెడు కబుర్లు వినాలంటే ఈరోజు రాత్రి చూడాలి. అయితే, హైపర్ ఆది జబర్దస్త్ ను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లారని చెప్పాలి. ఆ వేదికపై మగాళ్లే ఆడాళ్ల వేషాలు వేస్తారు. కానీ ఆది ప్రతివారం ఎవరో ఒక అమ్మాయిని పట్టుకొస్తుంటాడు. వర్షిణి కూడా కొన్ని సార్లు ఆది కోసం ఆ షోకి వచ్చింది.