భర్తను ఇంటినుంచి వెళ్లగొట్టిన ఆ హీరోయిన్కోలీవుడ్లో వనిత విజయ్ కుమార్ పేరెత్తితే చాలు.. అందరూ జడుసుకుంటారు. చేసిన సినిమాలు తక్కువ. కానీ వివాదాలు మాత్రం బోలెడు. తెలుగులో ‘దేవి’తో పాటు తమిళంలో కొన్ని సినిమాల్లో నటించిన వనిత.. వ్యక్తిగత జీవితానికి సంబంధించి తరచూ వివాదాలతో వార్తల్లో నిలుస్తుంటుంది.
ఆమె ఆస్తి విషయంలో తండ్రి విజయ్ కుమార్‌తో కూడా ఒక సందర్భంలో గొడవ పడి ఆయన్ని రోడ్డుకీడ్చే ప్రయత్నం కూడా చేసింది. ఆమెకు ఇప్పటికే రెండుసార్లు పెళ్లి జరిగింది. ఇద్దరు భర్తల నుంచి విడిపోయాక కొన్ని నెలల కిందట పీటర్ పాల్ అనే ఫిలిం మేకర్‌ను పెళ్లాడటం ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఐతే ఈ పెళ్లి జరిగిన తర్వాతి రోజు నుంచే గొడవ మొదలైంది.
పీటర్ నుంచి తానింకా విడాకులు తీసుకోకముందే అతడిని వనిత ఎలా పెళ్లి చేసుకంటుందని ప్రశ్నించిన ఆమె.. వారిపై కేసు కూడా పెట్టింది.దీనికి సంబంధించిన గొడవ అలా కొనసాగుతుండగా.. పీటర్, వనిత మాత్రం కలిసి జీవించసాగారు. పీటర్‌తో పాటు తన పిల్లల్ని వెంటబెట్టుకుని ఆమె గోవాకు ట్రిప్ కూడా వేసింది. అక్కడి నుంచి సంతోషంగా ఫొటోలు దిగి సోషల్ మీడియాలోనూ షేర్ చేసింది. మధ్యలో పీటర్ అనారోగ్యం పాలైతే.. వనిత దగ్గరుండి చూసుకోవడంతో చలించిపోయిన పీటర్ ఆమెను దేవతగా అభివర్ణించినట్లు కూడా మీడియాలో వచ్చింది.
ఇదంతా ఓకే కానీ.. ఇప్పుడు చూస్తేనేమో పీటర్‌ను వనిత తన ఇంటి నుంచి వెళ్లగొట్టినట్లు తాజాగా వార్తలొస్తున్నాయి. పీటర్ పెద్ద తాగుబోతు అట. రోజూ విపరీతంగా మద్యం తాగడం, వనిత మీద దాడికి ప్రయత్నిస్తుండటంతో ఆమె తట్టుకోలేకపోయిందట. ఏ పనీ చేయకుండా అదే పనిగా తాగి తనను వేధిస్తుండటంతో చివరి అతడి బాధ తాళ లేక ఇంటి నుంచి బలవంతంగా గెంటేయించినట్లు తమిళ మీడియాలో వార్తలొస్తున్నాయి. మరి ఈ వార్తలపై వనిత ఎలా స్పందిస్తుందో చూడాలి.