ప్రపంచ సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డ్స్ ఆస్కార్ ను దక్కించుకోవాలని కలలుగనని నటీనటులు, దర్శకులు, టెక్నిషియన్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. సినీ రంగుల ప్రపంచంలో ‘ఎవరెస్ట్’ వంటి ఈ అవార్డును కైవసం చేసుకోవాలని, అవార్డును ముద్దాడాలని అనుకోనివారుండరు. ఆ విధంగా అందరూ ప్రెస్టీజియస్ గా భావించే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్లో అంగరంగ వైభవంగా జరిగింది.
95వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ దక్కించుకుంది. ఆర్ఆర్ఆర్ తో పాటు ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ డాక్యుమెంటరీ కేటగిరీలో ఆస్కార్ దక్కించుకుంది. ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ ఏకంగా 7 ఆవార్డులను సొంతం చేసకొని 2023 ఆస్కార్ అవార్డుల జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచింది.
95వ అకాడమీ అవార్డులు అందుకున్న వ్యక్తులు, చిత్రాల జాబితా:
ఉత్తమ చిత్రం: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
ఉత్తమ నటి: మిచెల్ యో (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ నటుడు: బ్రెండన్ ఫ్రేజర్ (ది వేల్)
ఉత్తమ దర్శకుడు: డేనియల్ క్వాన్, డేనియల్ షినెర్ట్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ ఒరిజినల్ సాంగ్: నాటు నాటు (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్: నవల్నీ
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: ఉమెన్ టాకింగ్
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్
ఉత్తమ సహాయ నటుడు: కే హుయ్ క్వాన్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్: గిల్లెర్మో డెల్ టోరోస్ పినోచియో
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: అవతార్ –ది వే ఆఫ్ వాటర్
ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్
ఉత్తమ సహాయ నటి: జామీ లీ కర్టిస్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
ఉత్తమ స్కోరు: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్
ఉత్తమ సౌండ్: టాప్ గన్: మావెరిక్
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్
ఉత్తమ మేకప్, హెయిర్ స్టైలింగ్: ది వేల్
ఉత్తమ డాక్యుమెంటరీ (షార్ట్ సబ్జెక్ట్): ది ఎలిఫెంట్ విస్పరర్స్
ఉత్తమ షార్ట్ ఫిల్మ్ (యానిమేటెడ్): ది బాయ్, ది మోల్, ది ఫాక్స్ అండ్ ది హార్స్
ఉత్తమ షార్ట్ ఫిల్మ్ (లైవ్ యాక్షన్): యాన్ ఐరిష్ గుడ్ బై