తెల్లారింది మొదలు పడుకునే వరకు అసమాన్యుడ్ని మొదలు పెడితే సామాన్యుడు వరకు అందరూ అనునిత్యం వాడే గూగులమ్మకు దిమ్మ తిరిగే ఉదంతం చోటుచేసుకుంది. తాజాగా అమెరికా ప్రభుత్వం గూగుల్ పై కేసు వేసింది. సెర్చ్.. యాడ్స్ విషయంలో గూగుల్ తన అధిపత్యాన్ని పెంచుకోవటానికి యాంటీ ట్రస్టు చట్టాన్ని ఉల్లంఘించినట్లుగా అమెరికా డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్ కేసు వేశారు.
వీరికి మద్దతుగా కాలిఫోర్నియా డెమొక్రాట్ రాష్ట్ర అటార్నీ జనరల్ బాహాటంగానే మద్దతను ఇచ్చాయి.
గూగుల్ పై ఒక ట్రిలియన్ డాలర్లు.. అంటే మన రూపాయిల్లో చూస్తే.. 73, 73, 830 కోట్లు గా జరిమానాగా విధించాలని కోరాయి. ఇదిలా ఉంటే.. తనపై వచ్చిన ఆరోపణల్ని గూగుల్ ఖండించుకుంది. సెర్చ్ ఇంజిన్.. యాడ్స్ విషయంలో వినియోగదారుల అభిప్రాయాల్ని బట్టి మారుతుంటాయని పేర్కొంది. గూగుల్ ని ఎవరో బలవంతం చేయటం వల్ల ఎంపిక చేసుకోరని.. వారికి ఇష్టమైతే వచ్చి సెర్చ్ చేస్తారని పేర్కొనటం గమనార్హం.
ఇదిలా ఉంటే అమెరికా ప్రభుత్వం మాత్రం గూగుల్ ఇరుకున పడేలా వ్యాఖ్యలు చేయటం కనిపిస్తోంది. ఇతర సంస్థల వ్యాపార పద్దతుల్లో మార్పుల్ని బలవంతంగా సూచిస్తోందని.. అదే కేసు పెట్టటానికి ప్రధాన కారణంగా అమెరికా సర్కారు పేర్కొంది. ఒక్క అమెరికాలోనే కాదు.. యూరోపియన్ దేశాల్లోనూ గూగుల్ పైన జరిమానాలు విధించటం గమనార్హం. అయితే.. ఈ కేసుల్ని గూగుల్ లో సవాలు విసరటం ఆసక్తికరంగా మారింది. మరి.. ఫైన్లు ఏ స్థాయిలో ఉంటాయన్నది కాలమే సరైన సమాధానం చెబుతుందని చెప్పక తప్పదు.