పరిటాల రవి…తెలుగు రాజకీయాలతో పరిచయం ఉన్న ప్రజలకు సుపరిచితుడైన డైనమిక్ లీడర్. అనంతపురం రాజకీయాలలో ఓ వెలుగు వెలిగిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి. అన్న ఎన్టీఆర్ పిలుపు అందుకొని ఫ్యాక్షన్ వదిలేసి రాజకీయాల్లోకి వచ్చిన మాస్ లీడర్. అటువంటి నేతను 2005లో ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. అయితే, అనూహ్యంగా 18 ఏళ్ల తర్వాత ఆ కేసులో నిందితులకు బెయిల్ రావడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
పరిటాల రవి మర్డర్ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం చర్చనీయాంశమైంది. ఏ-3 నారాయణ రెడ్డి, ఏ-4 రేఖమయ్య, ఏ-5 రంగనాయకులు, ఏ-6 వడ్డే కొండ, ఏ-7 ఓబిరెడ్డిలకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది. 2005 నుంచి జైల్లోనే ఉండడం, కేసు విచారణ ముందుకు సాగకపోవడం వంటి కారణాలతో వారు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది.