కోట్లు ఖర్చుపెట్టి కట్టుకున్న జగన్ సొంత ఇంటి బిల్లులు ప్రభుత్వ డబ్బుల నుంచి చెల్లిస్తున్న విషయం సంచలనం అవుతోంది. అదేంటి సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ కూడా భారీగా ఖర్చుపెట్టి కట్టించారుగా అనుకుంటున్నారా? అక్కడే మీరు తప్పులో కాలేశారు.
కేసీఆర్ సీఎంగా ఓడిపోతే ఆ ప్రగతి భవన్ తర్వాత సీఎం నివాసం అవుతుంది. కానీ జగన్ మళ్లీ ఓడిపోతే అది జగన్ కే సొంతం. ఎందుకంటే అది జగన్ సొంత ఇల్లు. తాడేపల్లిలో ఉన్న జగన్ ఇల్లు మొత్తం నిర్మాణానికి 18 కోట్లు ఖర్చయ్యాయట. జగన్ ఎక్కడ ఇల్లు కట్టినా పెద్దగా ఆర్భాటంగా కడతారు.
ఇటీవలే తాడేపల్లిలో కట్టిన ఇల్లుకు 18 కోట్లు ఖర్చయ్యాయట. మరి ఇటీవలే కడితే అన్ని అవసరాలు ఏర్పాటుచేసి ఉంటారుగా మరి తర్వాత దేనికోసం 15 కోట్లు ఖర్చుపెట్టారు అనుకుంటున్నారా? మీరు మళ్లీ పప్పులో కాలేశారు.
గతంలో కట్టిన ఇంటికి చట్టంలో ఉన్న నిబంధన అడ్డం పెట్టుకుని తాజాగా ఏవో మార్పులు చేసినట్టు ఇప్పటికే కట్టిన సొమ్మును రాబడుతున్నారు… అలా ప్రజల సొమ్ముతో సొంత ఇల్లు సమకూర్చుకుంటున్నారు అని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. ఏది నిజమో ఒక సీఐడీ విచారణ వేసి తేల్చాలి.
ఇక పోతే ఈ రెండు సంవత్సరాల్లో జగన్ ఇంటిపై ఎపుడు ఎంత పెట్టారు అన్న లెక్క ఇక్కడ ఉంది.
GO 132 – Road – 5 Cr
GO 133 – Security Arrangements – 1.895 Cr
GO 139 – Electrical Maintenance Staff – 0.085 Cr
GO 146 – Electrical & Electro Mechanical Works – 3.635 Cr
G.O. 202 – Praja Darbar – 0.825 Cr
G.O. 254 – Temporary Arrangements – 0.225 Cr
G.O. 259 – Aluminium Windows/Doors – 0.73 Cr
G.O. 279 – View Cutter – 3.25 cr
# Total – 15.65 Cr
కొసమెరుపు ఏంటంటే…. జగన్ ఇంటికోసం ఖర్చుపెట్టిన ఈ డబ్బులతో అన్న కాంటీన్లు ఏడాది పాటు నడపొచ్చట. రెండేళ్లలో 15 కోట్లు ఖర్చుపెట్టారంటే మొత్తానికి రూపాయి జీతం తీసుకుంటున్నాను అని డబ్బా కొట్టి ఐదేళ్లలో జగన్ తన నివాసం కోసమే వంద కోట్లు వాడేసేలా ఉన్నారు .
అంటే
జీతం రూపాయి
హెచ్ ఆర్ ఎ నెలకు సరాసరి 70 లక్షలు అన్నమాట.
అదిరిందయ్యా జగన్ !