అగ్రరాజ్యం, ప్రపంచానికి టెక్నాలజీ నేర్పించే రాజ్యం… అమెరికాకు కరోనా చుక్కలు చూపిస్తోంది. ఇప్పటివరకు 3 లక్షల మంది అమెరికాలో కరోనాతో మరణించడం అంటే మామూలు విషయం కాదు, అమెరికాలో ఏ వ్యాధి ఇంత తక్కువ కాలంలో ఇంత మందిని బలిగొనలేదు. అలాంటిది కరోనా అమెరికాను అతలాకుతలం చేస్తోంది.
అమెరికాలో ఎన్నికలు, తర్వాత థాంక్స్ గివింగ్ డే కారణంగా కరోనా పెరుగుతూ వస్తోంది. ఇపుడు క్రిస్మస్, న్యూ ఇయర్ వస్తోంది. అది ఇంకెంత భయంకరంగా కేసులు పెంచుతుందో అని గవర్నమెంట్లు భయపడుతున్నాయి.
పెరుగుతున్న కేసులతో రోగుల తాకిడి ఆసుపత్రులకు పెరుగుతోంది. దీంతో అవి కిక్కిరిసిపోతున్నాయి. వైద్య సిబ్బంది కొరత ఏర్పడి విపరీతంగా ఒత్తిడి పడుతోంది. దీంతో ప్రభుత్వం కఠిన చర్యలు మొదలుపెట్టింది.
ఇపుడు అమరికాలో ఆంక్షలు మళ్లీ మొదలయ్యాయి.
న్యూయార్క్‌లో ఇండోర్ డైనింగ్ నిషేధించారు.
పెన్సిల్వేనియా పాఠశాలల్లో క్రీడలు నిషేధించారు.
చాలాచోట్ల జిమ్‌లు, జూదశాలలను మూసివేశారు.
మరిన్ని రాష్ట్రాల్లో ఈ ఆంక్షలు విస్తరించవచ్చంటున్నారు.