సల్లూ భాయ్ అబిమానులకు నిన్న పండుగ రోజు. సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం “రాధే”.. వాంటెడ్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రం ఓటీటి ద్వారా నిన్న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల అయ్యింది.
“జీ 5″లో విడుదలతో పాటుగా అవకాశం ఉన్న మేరకు థియేట్రికల్ విడుదల కూడా మేకర్స్ ప్లాన్ చేశారు. దాంతో ఎక్కడెక్కడి సల్మాన్ ఖాన్ అభిమానులు యాప్ ని ఓపెన్ చేసుకుని కూర్చున్నారు.
అలా ఈ చిత్రం డైరక్ట్ గా స్ట్రీమింగ్ కు రావడంతో భాయ్ క్రేజ్ కు జీ 5 వారి స్ట్రీమింగ్ యాప్ క్రాష్ అయ్యిపోయిందట. మొత్తం 1 మిలియన్ మందికి పైగానే ఒకేసారి సినిమా చూసేందుకు వచ్చారని సమాచారం.
తర్వాత దానిని జీ 5 వారు ఫిక్స్ చేశారట. పే పర్ వ్యూ గా తీసుకొచ్చినా కూడా సల్మాన్ సినిమాకు ఓ రేంజిలో రెస్పాన్స్ నే వచ్చింది.
దిశాపటానీ హీరోయిన్గా నటిస్తున్న రాధే మూవీలో డ్రగ్ మాఫియాను కంట్రోల్ చేసి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా నటిస్తున్నారు సల్మాన్.
డైరెక్టర్‌గా సల్మాన్‌తో ప్రభుదేవాకు ఇది హ్యాట్రిక్ మూవీ. గతంలో వీళ్ల కాంబోలో పోకిరీ రీమేక్ వాంటెడ్, దబ్బంగ్3 వచ్చాయి. డీఎస్పీ మార్క్ వున్న క్రేజీ బీట్…. సీటీమార్…. రాధే మూవీలో జబర్దస్త్‌గా రిపీటైంది.
ఇక సినిమా డ్యూరేషన్ విషయానికి వస్తే సల్మాన్ కెరీర్లో ఇంత షార్ట్ లెంగ్త్‌తో రిలీజ్ అయిన మూడో సినిమా రాధే.
ఇక ఈ చిత్రాన్ని మొదట థియేటర్లలో రిలీజ్ చేస్తామని సల్లూ భాయ్ ప్రకటించారు. దీంతో థియేటర్ యజమానులు భాయ్‌ను కలిసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
కరోనా సెకండ్ వేవ్‌తో దేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా థియేటర్లు మూతపడ్డాయి. ఈ పరిస్థితుల్లో సినిమాని థియేటర్లలో విడుదల చేయడం అనేది అసాధ్యం.
కాని తప్పనిసరి పరిస్దితుల్లో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సల్మాన్ నిర్ణయం తీసుకున్నారు. దాంతో థియేటర్ యజమానులకు క్షమాపణ చెప్పారు సల్మాన్ .