వైసీపీ నాయకులకు భారీ షాక్ తగిలింది. హైకోర్టులో వారు ఆశించిన విధంగా పరిణామాలు కనిపించలేదు. పైగా ఊరట అసలే లభించలేదు. దీంతో సదరు నేతలను ఎప్పుడైనా అరెస్టు చేసే అవకాశం ఉంది. వారు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది.
ఏం జరిగింది?
2022లో మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు దాడి చేసిన విష యం తెలిసిందే. ఈ ఘటనలో పార్టీ కార్యాలయం పూర్తిగా దెబ్బతింది. ఫర్నిచర్‌కు నిప్పు పెట్టబోయారు. అయితే.. అవి ఫైర్ ఫ్రీ కావడంతో ప్రమాదం తప్పింది. ఇక, వాటినిధ్వంసం చేశారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని కూల్చే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే టీడీపీ నాయకులు అక్కడకు చేరుకోవడం.. వైసీపీ నాయకులు అక్కడ నుంచి పారిపోయారు. అయితే.. దీనిపై అప్పటి పోలీసులు కేసు నమోదు చేసినా.. విచారణ చేయలేదు.
కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసును పరుగులు పెట్టిస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ చౌదరి, నందిగం సురేష్ సహా పదుల సంఖ్యలో నాయకులపై పోలీసులు కేసులు పెట్టారు. ఈ విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే.. తమను ఎప్పుడైనా అరెస్టు చేసే అవకాశం ఉందని గుర్తించిన నాయకులు వెంటనే హైకోర్టును ఆశ్రయిం చారు. తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు.
దీనిపై ఇటు పోలీసులు, అటు వైసీపీ నాయకుల తరఫున వాదనలు కొన్నాళ్ల కిందటే పూర్తయ్యాయి. తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని.. రాజకీయ కోణంలోనే కేసులు పెట్టారని.. తమ పాత్ర లేదని వైసీపీ నాయకులు చెప్పారు. అయితే.. ఉద్దేశ పూర్వకంగానే కార్యాలయంపై దాడి చేశారని.. కుట్ర కోణం ఉందని.. దీనివెనుక పెద్దలు ఉన్నారని సీఐడీ తరఫు న్యాయ వాది పేర్కొన్నారు. మొత్తానికి బుధవారం హైకోర్టు.. తీర్పు వెలువరించింది. వీరు పెట్టుకున్న ముందస్తు బెయిల్‌ను రద్దు చేసింది. దీంతో ఏ క్షణమైనా నాయకులను అరెస్టు చేసే అవకాశం ఉంది.