టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాయలసీమ పర్యటన దిగ్విజయంగా కొనసాగుతోంది. ‘సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ లో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు…కియా కార్ల పరిశ్రమను సందర్శించి సెల్ఫీ తీసుకుని వైసీపీ ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. అనంతపురం జిల్లాకు వైసీపీ ఎన్ని పరిశ్రమలు తీసుకువచ్చిందో, ఎన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసిందో చెప్పాలని నిలదీశారు. ఈ జిల్లాలో కియా పరిశ్రమ ఒక ప్రభంజనం అని, కరవు నేలపై కియా పరిశ్రమ వస్తుందని ఎవరైనా ఊహించారా? అని ప్రశ్నించారు.
కదిరిలో భారీ రోడ్‌షో, బహిరంగ సభ సందర్భంగా పోలీసులపై చంద్రబాబు మండిపడ్డారు. టోపీలు తీసేయాలని, వైసీపీ నేతలు చెప్పినట్లు వింటే సమస్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో నకిలీ మద్యం ద్వారా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, ఆ మద్యం ద్వారా వచ్చిన సొమ్మంతా తాడేపల్లి కొంపకు చేరుతోందని ఆరోపించారు. జగన్ మూర్ఖత్వం, అజ్ఞానానికి రాయలసీమ బలయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దిరెడ్డికి దోచిపెట్టేందుకే కొత్త ప్రాజెక్టులు అని దుయ్యబట్టారు. గతంలో హైదరాబాద్ అంటే చార్మినార్ అని…ఇపుడు హైటెక్ సిటీ అని, ఏపీలోనూ తన విజన్ తో, 40 ఏళ్ల అనుభవంతో సంపద సృష్టిస్తానని చెప్పారు.
ఏపీ ఒక సైకో, పిచ్చోడు, మూర్ఖుడి చేతిలోకి వెళ్లిందని, అలా వెళితే ఏం జరుగుతుందో ఇప్పటికే ప్రజలకు అర్థమైందని చంద్రబాబు అన్నారు. టీడీపీ పాలనలో ప్రాజెక్టులకు రూ.68 వేల కోట్లు ఖర్చు చేస్తే, వైసీపీ కేవలం రూ.22వేల కోట్లే ఖర్చు చేసిందని చెప్పారు. రివర్స్ టెండరింగ్ అంటూ రివర్స్ పాలనను జగన్ మొదలుబెట్టారని, సైకో జగన్‌కు పరిపాలించే అర్హత లేదని మండిపడ్డారు. కదిరిలో తన సభకు వచ్చిన జనాన్ని చూసి వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెట్టి ఉంటాయని చురకలంటించారు.
సిగ్గులేని ఎంపీ, సైకో జగన్ కుటుంబం వివేకాను బలితీసుకుందని, బాబాయిని చంపిన వ్యక్తికి ఓటేస్తే జనానికి కూడా గొడ్డలి పోటు తప్పదని హెచ్చరించారు. తాను సింహాన్ని అని, చనిపోయేదాకా ఇలాగే ఉంటానని సవాల్ విసిరారు. సైకోను ఇంటికి పంపేందుకు ఇంటికొకరు టీడీపీ జెండా పట్టుకోవాలని పిలుపునిచ్చారు. జగన్ ను ప్రశ్నించిన వారి పింఛన్, రేషన్ కార్డు తీసేస్తారని భయపడవద్దని, వాటిని తొలగిస్తే.. తాను అధికారం చేపట్టాక వడ్డీతో సహా ఇస్తానని హామీ ఇచ్చారు.
మంత్రి ఆంబోతు రాంబాబు ‘బ్రో’ సినిమాపై ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి వెళ్లిందని ఎద్దేవా చేశారు.రు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఎప్పుడు బట్టలిప్పేసి రోడ్డుపైకి వస్తాడో తెలియతనా, జనం ఆయనను శాశ్వతంగా బట్టలు విప్పి పంపించే రోజులు దగ్గరలో ఉన్నాయని విమర్శలు గుప్పించారు.