మంగళగిరిలోని ఇప్పటంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజకీయాల్లోనూ సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. గతంలో జనసేన ఆవిర్భావ సభ కోసం పొలాలు ఇచ్చారన్న అక్కసుతో ఆ గ్రామస్థులపై జగన్ సర్కార్ కక్ష సాధిస్తున్న వైనం విమర్శల పాలవుతోంది. ఈ క్రమంలోనే గ్రామంలో రోడ్ల వెడల్పు చేపడుతున్నామంటూ ఇళ్లను కూల్చివేసిన వైనం హాట్ టాపిక్ గా మారింది.
ఈ క్రమంలోనే ఇళ్లు, ప్రహరీ గోడలు కోల్పోయిన బాధితులను పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ ఇప్పటంలో పర్యటిస్తున్నారు. అయితే, పవన్ కళ్యాన్ ను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా గాడ్ ఫాదర్ సినిమాలోని సీన్ తరహాలో పవన్ నడుచుకుంటూ ఇప్పటానికి చేరుకున్న వైనం వైరల్ గా మారింది. ఇక ఇప్పటం గ్రామానికి చేరుకోకముందు తాను ప్రయాణిస్తున్న కారు టాప్ పైకి ఎక్కి కూర్చున్న పవన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కారు పైభాగంలో కాళ్లు బార్లా జాపుకుని మరీ పవన్ కూర్చుని ప్రయాణించడం సంచలనం రేపింది. దీంతో ఈ వీడియోను పోస్ట్ చేసిన జనసైనికులు మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. వైసిపి గుండాలను ధైర్యంగా ఎదుర్కోవాలని వారికి ధైర్యాన్ని ఇచ్చారు పవన్. ఎన్ని కుట్రలు చేసినా ఎదుర్కోవడానికి నేను సిద్ధం అంటూ సజ్జలకు పవన్ సవాల్ విసిరారు.
తనకు మద్దతు ఇచ్చేవారి ఇళ్లు కూలుస్తారా అంటూ సజ్జలపై పవన్ మండిపడ్డారు. వైసీపీ దౌర్జన్యాలపై ఇకనుంచి తన పోరాటం కొనసాగుతుందని, వైసిపి వాళ్ళు చొక్కా పట్టుకుంటే చెప్పు తీసుకొని కొట్టండి అని జనసైనికులకు పవన్ పిలుపునిచ్చారు. పద్ధతిగా రాజకీయం చేస్తే పద్ధతిగానే వెళ్తామని ,దాడులు చేస్తే తాము కూడా అదే పద్ధతిలో తేల్చుకుంటామని వైసిపికి పవన్ మరోసారి డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు.
మనల్ని ఎవడ్రా ఆపేది !!! 🔥#JanaSenaWithIppatampic.twitter.com/cGl4ZCeaDv
— Trend PSPK (@TrendPSPK) November 5, 2022