• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

బాలకృష్ణకు నాగచైతన్య కౌంటర్

admin by admin
January 24, 2023
in Movies, Trending
0
0
SHARES
160
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

నందమూరి బాలకృష్ణ అంటే రెండు రకాలు ఇమేజ్‌లు ఉంటాయి. ఆయన్ను బాగా తెలిసినవారు, ఆయన్ను ఇష్టపడేవారి దృష్టిలో ఒక రకమైన మంచి ఇమేజ్ ఉండగా.. బాలకృష్ణకు నోటి దురుసు, చేతి దురుసు కనిపించిన ప్రతిసారీ ఆయన్ను వ్యతిరేకించే వర్గం ఇంకోటి ఉంటుంది. కానీ, ఇటీవల కాలంలో అన్‌స్టాపబుల్ షో‌తో గతంలో తనను వ్యతిరేకించినవారినీ తన అభిమానులుగా మార్చుకున్నారు బాలకృష్ణ. అంతేకాదు.. ఇటీవల కాలంలో కృష్ణ, కృష్ణంరాజు, సత్యనారాయణ, చలపతిరావు వంటి సీనియర్ నటులు మరణించిన సందర్భాలలో ఆయన వారి గురించి చెప్పిన మంచి మాటలు వంటివి ఆయనకు పాజిటివ్ ఇమేజ్‌ను తీసుకొచ్చాయి.

అయితే.. తన సినిమాల విషయానికి వచ్చేసరికి.. తన తండ్రి ఎన్టీఆర్ విషయానికొచ్చేసరికి ఆయన చెప్పుకొనే గొప్పలు మాత్రం ఇప్పటికీ చాలామందికి చిరాకుపెడుతుంటాయి. తన గురించి, తన తండ్రి ఎన్టీఆర్ గురించి చెప్పుకొనే హక్కు బాలకృష్ణకు ఉందనడంలో సందేహమే లేదు కానీ ఇతరుల గురించి తక్కువ చేసి మాట్లాడినప్పుడే ఆయనపై విమర్శలు మొదలవుతుంటాయి. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నాగబాబు సీరియస్‌గా రియాక్టయిన సందర్భాలున్నాయి.

ఇప్పుడు కూడా బాలకృష్ణ నోరుజారడం వివాదంగా మారింది. తాజాగా ఆయన వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్‌లో ‘అక్కినేని, తొక్కినేని’ అనడం వివాదంగా మారింది. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ అన్నట్లుగా అక్కినేని నాగచైతన్య ఈ రోజు ట్వీట్ చేశారు. ‘నందమూరి తారకరామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వీ రంగారావు గారు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరవపర్చడం మనల్ని మనం కించపరుచుకోవడమే’ అంటూ నాగచైతన్య ట్వీట్ చేశారు. ఇది బాలయ్యకు కౌంటరేనంటున్నాయి సినీవర్గాలు.

కాగా, వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా బాలయ్య ‘అందరూ అద్భుతంగా నటించారు. నాకు మంచి టైం పాస్. ఎప్పుడు కూర్చుని వేదశాస్త్రాలు, నాన్నగారు, డైలాగులు, ఆ రంగారావు గారు, ఈ అక్కినేని తొక్కనేని అన్నీ మాట్లాడుకునేవాళ్లం’ అని అన్నారు. దీంతో అయన అక్కినేని నాగేశ్వరరావు గురించి తేలిగ్గా మాట్లాడారన్న ఉద్దేశంలో నాగచైతన్య కౌంటర్ వేశారు. బాలయ్య ఇటీవలకాలంలో మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడిలా మళ్లీ నోరు జారడంతో ఆయన విమర్శకులు నోళ్లకు పనిచెప్తున్నారు.

Tags: akkineni thokkineniBalakrishnacounternagachaitanya
Previous Post

కన్నా ముహూర్తం రిపబ్లిక్ డే.. నిజమేనా?

Next Post

టీడీపీలో రాయపాటి వార్నింగ్ కలకలం

Related Posts

Trending

ఉద్యోగులపై జగన్ కుట్ర బయటపెట్టిన పట్టాభి

June 6, 2023
Trending

సీఐడీ విచారణలో శైలజా కిరణ్ ఏం చెప్పారు?

June 6, 2023
Trending

షాతో భేటీపై వైసీపీకి చంద్ర‌బాబు షాకింగ్ రిప్ల‌య్

June 6, 2023
Trending

తాడేప‌ల్లికే ప‌రిమిత‌మైన పౌర్ణ‌మి సంద‌డి..!

June 5, 2023
Trending

టీడీపీ, బీజేపీల పొత్తుపై తేల్చేసిన బండి సంజయ్

June 5, 2023
Trending

టీడీపీ ఎమ్మెల్యే డోలా అరెస్ట్..కొండపిలో హై టెన్షన్

June 5, 2023
Load More
Next Post

టీడీపీలో రాయపాటి వార్నింగ్ కలకలం

Latest News

  • ఉద్యోగులపై జగన్ కుట్ర బయటపెట్టిన పట్టాభి
  • సీఐడీ విచారణలో శైలజా కిరణ్ ఏం చెప్పారు?
  • షాతో భేటీపై వైసీపీకి చంద్ర‌బాబు షాకింగ్ రిప్ల‌య్
  • సందడిగా జరిగిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ 5వ స్నాతకోత్సవం!
  • తాడేప‌ల్లికే ప‌రిమిత‌మైన పౌర్ణ‌మి సంద‌డి..!
  • నారా లోకేష్ మంగళగిరి లో రెండవ క్రీడా మైదానం ఏర్పాటు
  • ఆనంపై దాడి…జగన్ కు లోకేష్ డెడ్లీ వార్నింగ్
  • వైసీపీ మూకలను తరిమికొట్టిన ఆనం రమణారెడ్డి…వైరల్
  • టీడీపీ, బీజేపీల పొత్తుపై తేల్చేసిన బండి సంజయ్
  • టీడీపీ ఎమ్మెల్యే డోలా అరెస్ట్..కొండపిలో హై టెన్షన్
  • జగన్ అప్పులపై ఆనం సంచలన వ్యాఖ్యలు
  • మ‌నోడే అయినా.. విమ‌ర్శిస్తే లాగేయ‌డ‌మే: వైసీపీ ఇంతే గురూ!
  • టీడీపీతో పొత్తుపై నాదెండ్ల క్లారిటీ
  • ఆ స్థానంలో పవన్ 60 వేల మెజారిటీతో గెలుస్తారంటోన్న రఘురామ
  • జగన్ పాము వంటి వాడు… లోకేష్ ఫైర్

Most Read

శక పురుషునికి ‘ట్రై వ్యాలీ ఎన్టీఆర్ అభిమానులు’ శత జయంతి నీరాజనం!

మేరీల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు!

చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?

శాన్ ఫ్రాన్సిస్కో లో ‘రాహుల్ గాంధీ’కి ఘన స్వాగతం!

ఏపీలో పెల్లుబుకుతున్న `అస‌హ‌న రాజ‌కీయం`.. రీజ‌నేంటి?

ఆ మెగా హీరోతో లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra