యాత్ర ఫలం దక్కేనా..!

ప్రత్యేక హోదా సాధన పోరులో బలమైన గొంతెవరిది. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న చర్చ ఇది. హోదా పరుగు ముందుగా ప్రారంభించిన జగన్‌ గమ్యం చేరుకునే లోపే.. బాబు ఎత్తులకు చిత్తయినట్లు విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. తొలి నుంచి ప్రత్యేక హోదా కావాలి అని పోరు పెడుతున్న జగన్‌… ఆ అంశాన్ని కేంద్రం వద్ద ప్రస్తావించాలన్న ధ్యాస మరచిపోయారు. ఎప్పుడూ రాష్ట్రంలో అధికార పార్టీ తెలుగుదేశంపై చిందులు వేయడం తప్ప.. కేంద్ర ప్రభుత్వాన్ని ధాటిగా ప్రశ్నించలేకపోయారు. నాలుగున్నరేళ్లుగా హోదా కోసం పోరాడుతున్నానంటూ.. జనంలో రాజకీయ యాత్రలు చేస్తూ పోయిన జగన్మోహన్‌రెడ్డి… రాష్ట్రాన్ని నమ్మించి మోసం చేసిన భారతీయ జనతా పార్టీని ఏ ఒక్క సమావేశంలోనూ ఎండగట్టలేదు. మొదట్లో చంద్రబాబు హోదా అక్కర్లేదని తేల్చినా… కేంద్రం నుంచి ఏ రకమైన సాయం అందకపోవడంతో రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమైని తెలుసుకుని మోడీ దోస్తీకి కటీఫ్ చెప్పేశారు.

ఏడాదిగా మోడీ-షాల జోడీని ప్రజల మధ్య ఎండగడుతూ… రాష్ట్రానికి జరిగిన అన్యాయంలో తనపాత్ర ఏమాత్రం లేదని చెప్పేందుకు ధర్మపోరాట దీక్షలను అస్త్రంగా మలచుకున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా కేంద్ర వైఖరిని తప్పుబడుతూ వచ్చారు. ఇందులో ఎంత వరకూ సఫలమయ్యారనేది తేలాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే. కానీ అంతకుముందు చెప్పుకోవాల్సింది ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చేందుకు జాతీయస్థాయిలో పార్టీలను ఒప్పించేందుకు వివిధ స్థాయుల్లో చంద్రబాబు చూపుతున్న చాణక్యం రాజకీయాల్లో పెనుమార్పులకు నాంది కానుందని ఆ పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గత కొన్నాళ్లుగా ప్రత్యేక హోదా సాధన కోసం తెలుగుదేశం పార్టీ చేస్తున్న పోరాటం ప్రజల్లోకి బలంగా వెళుతోంది. తొలి నాళ్లలో చేసిన వ్యాఖ్యలపై జనం నుంచి వస్తున్న వ్యతిరేకతను గుర్తించిన చంద్రబాబు… కమలానికి కటీఫ్ చెప్పినప్పటి నుంచి ప్రజల్లో వస్తున్న మద్దతును మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. మొద‌ట్లో ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ అధినేత జగన్ గట్టిగా పోరాడినప్పటికీ ప్రస్తుతం మోడీతో లాలూచీ పడినట్లు బీజేపీ గుంటూరు సభకు వైసీపీ మద్దతుదారుల మద్దతుందనేది రాజకీయవర్గాల ఆరోపణ. ఇక ఏపీ ప్రజల శ్రేయస్సు కోసం పోరాటంలో రాజకీయ ఉద్దేశాలు పక్కన పెట్టి పోరాడాల్సింది పోయి హోదాసాధన క్రెడిట్‌ తనకే దక్కాలన్న ఆత్రం జగన్‌కు ఎక్కువైపోయిందని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

అందుకే ఆరంభంలో ఉన్న మద్దతు జగన్‌కు ఇప్పుడు లేదని రాజకీయ విశ్లేషకులు తేల్చిచెబుతున్నారు. ధర్మపోరాట దీక్షల ఫలితంగా చంద్రబాబు జనాల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించుకున్నట్లు టీడీపీ చేయించిన తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. దీనికి చంద్రబాబు హోదా పోరాటాలే కాక మోడీతో జగన్‌ లాలూచీ పడటం కూడా కారణమని తెలుస్తోంది. ప్రధాని మోడీ గుంటూరు సభలో చంద్రబాబుపై చేసిన విమర్శలే ఇందుకు నిదర్శనం. జగన్‌ను పల్లెత్తు మాటనకుండా మోడీ-బీజేపీ వ్యవహరించడం వారి మధ్య చీకటి ఒప్పందాన్ని బట్టబయలు చేసిందని టీడీపీ విమర్శిస్తోంది. దీనికి వైసీపీ నుంచి కూడా గట్టి కౌంటర్‌లు రాకపోవడంతో విమర్శలకు బలం చేకూరింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో జాతీయస్థాయిలో ప్రత్యేక హోదా ఆవశ్యకతను తెలియజేసేందుకు చంద్రబాబు జాతీయపార్టీలను ఏకం చేస్తుండగా… జగన్‌ మాత్రం రాష్ట్రంలో రాజకీయ యాత్రలు చేస్తున్నారని హోదా ఆవశ్యకత తెలిసిన వారు విమర్శిస్తున్నారు. చంద్రబాబు ఢిల్లీ వేదికగా చేసిన ధర్మపోరాట దీక్షలో ప్రధానమైన జాతీయ పార్టీల నేతలను భాగస్వాములను చేసి ప్రత్యేక హోదాపై మద్దతు కూడగట్టారు. భవిష్యత్తులో రాష్ట్రానికి హోదా సాకారమయ్యేలా కనిపించినా ఆ క్రెడిట్‌ ఎవరికి దక్కుతుందనేది ఇరు పార్టీలకు పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా వైసీపీకి ఇన్నాళ్లు చేసిన పోరాట ఫలం చంద్రబాబు చెంతకు చేరేలా ఉందని బెంగపట్టుకుంది. వ్రతం చెడకపోయినా ఫలం మాత్రం తమకు దక్కేలా లేదని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కొత్తవ్యూహాలు రచించేందుకు వైసీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.

రాజశేఖర్ రెడ్డి అంటేనే పేద వర్గాల్లో చాలా అభిమానం.. ఆరోగ్యశ్రీ, ఉన్నత చదువులకు చేయూత, 108, రైతు రుణ మాఫీ, రైతాంగానికి ఉచిత విద్యుత్తు వంటి అనే సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఆయన ప్రజల మనసుల్లో నిలిచిపోయారు. దాని ఫలితంగానే ఎటుంటి రాజకీయ అనుభవం లేని జగన్ కు వారంతా 2014లో అండగా నిలబడ్డారు. అధికారం దక్కించుకున్న తెలుగుదేశానికి వారికి కేవలం 1 శాతం మాత్రమే వ్యత్యాసం ఉందంటే ఆ క్రెడిట్ వైఎస్ఆర్ కే దక్కుతుంది. అయితే 2019కి వచ్చేసరికి ఆ మ్యాజిక్ పనిచేస్తుందో లేదో అనే అనుమానం జగన్ కోటరిలో కలిగి ఆ విషయాలు మళ్లీ ప్రజలకు గుర్తు చేసి లబ్ధి పొందాలనే ఉద్దేశంతో యాత్ర సినిమా తెరపైకి తీసుకొచ్చారు. మరి సినిమా విడుదలై ఫలితాలు వస్తున్న వేళ మోదీ సభకు టీడీపీ నిరసనల హోరు.. ఢిల్లీలో ధర్మపోరాట దీక్షతో యాత్ర ఫలాన్ని దూరం చేశాయని పార్టీ వర్గాలు తీవ్ర మథనపడిపోతున్నాయట.. మరి యాత్ర ఫలం ఆ పార్టీకి ఏ మాత్రం దక్కనుందో చూడాల్సిందే…

1 Comment

  1. But for CNN who is uniting all opposition parties at National level into a formidable force to oust Modi without inhibitions and fear, it would have been a cakewalk for Modi with using CBI, E.D, National media to browbeat and scare opposition leaders into submission. All National parties acknowledged the pre eminence of CBN in puncturing Modi’s hyperventilated balloon at Delhi ‘Dharma Porata Sabha’ yesterday.

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.