వైఎస్ వార‌సుడి అంత‌ర్మ‌థ‌నం!

సీఎం పీఠం ఎక్క‌గానే వైఎస్‌.. ప‌థ‌కాల‌తో పాటు.. కొడుకు ముచ్చ‌ట తీర్చాడ‌నే అప‌వాదు.. ల‌క్ష‌కోట్ల స్కామ్‌తో సీబీఐ నిజ‌మ‌ని నిరూపించింది. నెల‌ల త‌ర‌బ‌డి జైలులో నిందితుడిగా బెయిల్ దొర‌క‌క విల‌విల్లాడాల్సిన ప‌రిస్థితిలో వైసీపీ అధినేత జ‌గ‌న్ మాన‌సికంగా మ‌రంత మెరుగ‌య్యాడు. అనంత‌రం ఎన్నిక‌ల్లోనూ టీడీపీకు ధీటుగా.. బీజేపీను ఉలికిపాటు గురిచేసేంత‌గా ఓట్లు.. సీట్లు సాధించాడు. గెలుపున‌కు అడుగుదూరంలో ఆగిపోయాడు.

ఫ‌లితంగా చంద్ర‌బాబు నాయుడు విజ‌యాన్ని సొంతం చేసుకున్నాడు. మ‌ళ్లీ ఐదేళ్లు గ‌డుస్తున్నాయి.. ఇప్పుడూ అదే ప‌రిస్థితి జ‌గ‌న్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. త‌న వ‌ద్ద ఉన్న ఎమ్మెల్యేలు 22 మంది త‌గ్గారు. అంటే.. ఈ లెక్క‌న తెలుగుదేశం బ‌లం పెరిగింది. మ‌రోవైపు ఏపీ ప్ర‌త్యేక హోదా విష‌యంలో మొద‌టి నుంచి ఒకే మాట‌మీద ఉన్నా. జ‌గ‌న్‌ను జ‌నం న‌మ్మేప‌రిస్థితిలో లేరు. పోనీ.. ఎంపీల‌తో రాజీనామా చేయిస్తే.. టీడీపీను ఇరుకున పెట్ట‌వ‌చ్చ‌నుకుంటే.. అదీ బెడ‌సికొట్టింది. స్పీక‌ర్ ఫార్మెట్‌లో రాజీనామాలు స‌మర్పించిన వైసీపీ ఎంపీలు.. దానిలో ఎక్క‌డా త‌మ రాజీనామాల‌కు ఏపీ ప్ర‌త్యేక‌హోదా కార‌ణ‌మ‌నే విష‌యాన్ని వివ‌రించ‌లేద‌ట‌. పైగా మ‌రికొద్దిరోజులు గ‌డువిచ్చి వెన‌క్కిపంపారు. దీంతో అనుకున్న‌దొక‌టీ.. అయిన‌దొక‌టీ అన్న‌ట్లుగా మారింది.

పోనీ.. ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌లో వ‌స్తున్న జ‌నం.. అభిమానులు రేప‌టిరోజున త‌న‌కు ఓట్లేస్తారా! అనే అనుమానం కూడా ఉంద‌ట‌. మ‌రోవైపు ప‌వ‌న్‌.. త‌న‌ను టార్గెట్ చేస్తూ. అవినీతి గుర్తుల‌ను బ‌య‌ట‌పెడుతున్నారు. బీజేపీతో దోస్తీచేస్తే.. కేసుల నుంచి బ‌య‌ట‌ప‌డ‌వచ్చ‌నే అస‌లు విష‌యాన్ని ప్ర‌జ‌లు కూడా నిజ‌మ‌నే కోణంలోనే చూస్తున్నారు. ఓట్ల చీలిక‌తో తెలుగుదేశం పార్టీతో పోల్సితే.. వైసీపీ కే ఎక్కు న‌ష్టం అనేది ఇప్ప‌టికే పార్టీ శ్రేణులు లెక్క‌లు క‌డుతున్నారు. ఇవ‌న్నీ ప‌క్క‌న‌బెట్టినా.. కాపు సామాజిక‌వ‌ర్గానికి రిజ‌ర్వేష‌న్ అమ‌లుపై ఇప్ప‌టికీ పెద‌వి విప్ప‌లేదు. రైతు రుణ‌మాఫీపై ఎక్క‌డా ప్ర‌స్తావించ‌లేదు. రెడ్డి సామాజిక‌వ‌ర్గం పూర్తిగా జ‌గ‌న్‌ను త‌మ‌వాడిగా భావించే ప‌రిస్థితుల్లో లేదు. క్రైస్త‌వులు కూడా.. జ‌గ‌న్ బీజేపీతో చెలిమి చేస్తున్న‌ట్టు వ‌స్తున్న వార్త‌ల‌ను సీరియ‌స్‌గానే ప‌రిగ‌ణిస్తుంది. ముస్లిం మైనార్టీ కూడా.. వైసీపీ వైపు ఎలా నిలుస్తార‌నేది కూడా సందేహమే. 2019లో త‌న‌వైపే విజ‌యం అనుకున్న జ‌గ‌న్మోహ‌నుడికి.. ఇవ‌న్నీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయ‌ట‌. బ‌య‌ట‌ప‌డేందుకు మార్గాల కోసం అన్వేష‌ణ‌లో ప‌డ్డార‌ట‌.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.