అధినేత‌ను ఆటాడుకుంట‌న్నారుగా!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై టీడీపీ మాట‌ల దాడి పెంచింది. ప్ర‌జాసంక‌ల్పయాత్ర‌తో ఆయ‌న 2000 కిలోమీట‌ర్ల న‌డ‌క పూర్తి చేసిన ఆనందాన్ని నిల‌వ‌కుండా.. చేస్తున్నారు. విప‌క్ష నేత‌గా.. జ‌గ‌న్ ఉండాలా  .. ఈ రాష్ట్రం ఎలాపోయినాప‌ర్లేదు అనుకునే బీజేపీతో దోస్తీ చేస్తున్నాడంటూ టీడీపీ అధ్య‌క్షుడు క‌ళావెంక‌ట్రావు ఏకంగా ప్ర‌జ‌ల‌కు బ‌హిరంగ లేఖ రాశారు. య‌న‌మ‌ల అయితే.. క‌డ‌ప‌లో ఇంత దీక్ష చేస్తుంటే.. ఇంత అన్యాయం చేస్తుంటే.. బీజేపీపై మౌనంగా ఉండ‌టం భావ్య‌మా అంటూ నిల‌దీశారు. కేవ‌లం త‌న అనుంగుడు.. గాలి జ‌నార్ద‌న్ రెడ్డి కి ఉక్కు ఫ్యాక్ట‌ర దారాద‌త్తం చేసేందుకు బీజేపీతో క‌ల‌సినాట‌కం ఆడుతున్నారంటూ విమ‌ర్శించారు. 20వేల కోట్ల‌రూపాయ‌లు ప‌రిశ్ర‌మ ఏర్పాటుకు ఇవ్వాల్సిన కేంద్రం.. ఏపీకు దాన్ని ఇవ్వ‌టం ఇష్టంలేక‌నే.. ఇన్ని నాట‌కాలు ఆడుతుందంటూ దుయ్య‌బ‌ట్టారు. టీడీపీ నేత కాట్ర‌గ‌డ్డ బాబు ఏకంగా బెజ‌వాడ‌లో బీజేపీ నేత‌లు క‌న్నా, పురందేశ్వ‌రీల‌ను విమ‌ర్శిస్తూ ఏకంగా పోస్ట‌ర్ ఏర్పాటుచేశారు. ఇప్ప‌టి వ‌ర‌కూ టీడీపీ బీజేపీకు మిత్ర‌ప‌క్షంగా ఉంది. నాలుగేళ్ల‌పాటు.. ఇద్ద‌రూ చెట్టాప‌ట్టాల్ వేసుకుని తిరిగారు. అంత‌వ‌ర‌కూ నిజం.. ఇద్ద‌రి మ‌ధ్య విబేధాల‌తో టీడీపీ వీడిపోయింది.

 

కానీ.. బ‌య‌ట‌కు వ‌చ్చిన టీడీపీ.. విప‌క్ష నేత‌గా జ‌గ‌న్ ఏమి చేయ‌లేక‌పోయారంటూ.. జ‌నాన్ని న‌మ్మిస్తుంది. పైగా ఏపీ ప్ర‌జ‌లు కూడా.. నాలుగేళ్లు అంట‌కాగిన టీడీపీ త‌ప్పిదం కంటే.. ఇప్పుడిప్పుడే బీజేపీతో  స్నేహానికి సై అంటున్నా.. అన‌బోతున్న వైసీపీపైనే ద్వేషం పెంచుకున్నారు. పైగా జ‌గ‌న్ మెడ‌చుట్టు వున్న సీబీఐ కేసులు, కోట్లాదిరూపాయ‌ల ఆస్తుల‌ను కాపాడుకునేందుకే ఈ డ్రామాలంటూ టీడీపీ చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను జ‌నం నిజ‌మ‌నే భావ‌న‌కు వ‌స్తున్నారు. జ‌గ‌న్ పార్టీ బాగోగులు.. మీడియా స‌మావేశాల్లో ఏం మాట్లాడాల‌నేది తాను చూసినంత వ‌ర‌కూ స‌క్ర‌మంగానే నెట్టుకు వ‌చ్చారు. ఎప్పుడైతే ఏ2 సారీ.. రెండో నేత‌గా విజ‌య‌సాయిరెడ్డిని తెర‌మీద‌కు తెచ్చారు.. జ‌గ‌న్ ప్ర‌తిష్ఠ క్ర‌మంగా మ‌స‌క‌బారుతూ వ‌చ్చాయి. మొద‌ట్లో విజ‌య‌సాయిమాట‌లు.. ఇటు వైసీపీలో జోష్ పెంచినా క్ర‌మంగా.. పార్టీ ప‌రువును గంగ‌పాలు చేస్తున్నాడ‌నేంత వ‌ర‌కూ సొంత‌పార్టీ నేత‌లు చేరారు. రాజ‌కీయ అనుభ‌వం లేని.. విజ‌య‌సాయి ఎఫెక్టు వ‌ల్ల‌నే.. వైసీపీ అధినేత సందిగ్ధంలో ప‌డాల్సి వ‌చ్చిందంటున్నారు. ఇది చాల‌ద‌న్న‌ట్లు.. అటు పోల‌వ‌రం ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. ఇటు ఉక్కుదీక్ష కూడా స‌క్సెస్ అయ్యే అవ‌కాశాలున్నాయి. దీంతో తాను ఎన్నికిలోమీట‌ర్లు దూరం పాద‌యాత్ర చేసినా.. ప్ర‌యోజ‌నం ఎంత వ‌ర‌కూ అనేంత వ‌ర‌కూ అధినేత చేరార‌ట‌. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.