రాజ్యసభలో టీడీపీది పోరాటం.. వైసీపీది ఆరాటం

ఏపీ రాజకీయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. విభజన హమీల విషయంలో ఏపీ ప్రజలను మోసం చేసిందనే కారణంతో తెలుగుదేశం పార్టీ.. ఎన్డీయే నుంచి బయటికి వచ్చి, కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టింది. దీనిని ఆమోదించడంతో పార్లమెంట్‌తో చర్చ కూడా జరిగింది. అయితే, తర్వాత జరిగిన ఓటింగ్‌లో ఎన్డీయే కూటమి గెలిచినా.. టీడీపీ మాత్రం నైతికంగా విజయం సాధించింది. బీజేపీయేతర పార్టీలను కూడగట్టడంలో మొదట సక్సెస్ అయిన ఆ పార్టీ.. తర్వాత జరిగిన చర్చలో ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించి ఇతర పార్టీల మద్దతును కూడగట్టుకుంది. దీంతో విభజన హామీలపై చేసే పోరాటంలో ఆ పార్టీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. మరోవైపు వైసీపీ అధినేత జగన్ తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించడం ద్వారా పార్లమెంట్‌లో జరిగిన అవిశ్వాస చర్చలో ఆ పార్టీ దూరమవ్వాల్సి వచ్చింది. దీంతో వైసీపీ ఏం కోల్పోవలసి వచ్చిందో వారికి స్పష్టంగా అర్థమైంది.

రాజ్యసభలో సోమవారం తెలుగు రాష్ట్ర సభ్యులు చర్చకు పట్టుబట్టగా సభాపతి వెంకయ్య దానికి నిరాకరించారు. మంగళవారం చర్చ జరుపుదామంటూ చెప్పడంతో తెలుగు ఎంపీలు నిరసన తెలిపడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వెంకయ్య.. ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా కొద్దిసేపు నిలిపి వేశారు. దీంతో ఈరోజు ఏపీ సమస్యలపై చర్చ జరిగింది. ఈ చర్చలో ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ సుజనా చౌదరి చర్చను ప్రారంభించి, కేంద్రంపై విమర్శల వర్షం కురిపించారు. రాజ్య‌స‌భలో అప్ప‌టి ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్ ఇచ్చిన హామీల‌ను కూడా అమ‌లు చేయ‌క‌పోతే ఎలా అంటూ నిల‌దీశారు. వైసీపీ తరపున మాట్లాడిన విజయసారెడ్డి టీడీపీ ప్రత్యేక ప్యాకేజీకి అడ్డు చెప్పిందని ఆరోపిస్తూ.. నాలుగేళ్లుగా ఏపీ తరపున వైసీపీనే పోరాటం చేస్తుందని తమకే క్రెడిట్ దక్కేలా మాట్లాడడంతో సభలో కొంచెం గందరగోళ పరిస్థితి నెలకొంది. దీన్నంతా గమనించిన వారు టీడీపీ పోరాటం చేస్తుంటే.. వైసీపీ ఆరాటం ప్రదర్శిస్తోంది అని అనుకుంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.