వైసీపీ.. ఆప‌సోపాలు!

ఏదో జ‌రుగుతుంది.. మంచా.. చెడా.. గెలుపా. ఓటమా.. ఏమో..  అర్ధంకాని విష‌యాలు.. ఊహించ‌ని ఎత్తుప‌ల్లాలు.. వైసీపీను ఉక్కిరిబిక్క‌రి చేస్తున్నాయి. ఏపీలో టీడీపీ, జ‌న‌సేన, కాంగ్రెస్ పార్టీల ప‌రిస్థితి దాదాపు ఇంచుమించుగా ఇలాగే ఉన్నా.. వైసీపీ మాత్రం మ‌రింత ఎక్కువ‌గా త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతుంది. దీనికి కార‌ణం.. వైసీపీ.. బీజేపీతో ర‌హ‌స్య పొత్తు కుదుర్చుకుందంటూ టీడీపీ చేసిన ఆరోప‌ణ‌లు… ప్ర‌జ‌ల్లోకి బాగా వెళ్లాయి. దాదాపు అధిక‌శాతం ఓట‌రు కూడా ఇదే భావ‌న‌కు వ‌చ్చారు. ఇంకా.. ఎన్నిక‌ల‌కు 7 నెల‌ల గ‌డువు ఉంది కాబ‌ట్టి.. ఇప్పుడే ఇంద‌తా నిజ‌మ‌ని చెప్ప‌లే. అవాస్త‌వ‌మ‌ని అనుకోలేం. కానీ.. వైసీపీ త‌ర‌పున బ‌రిలో నిలిచి.. ప్ర‌త్య‌ర్థి పార్టీను ఎదుర్కొని గెలిచే అభ్య‌ర్థులంతా.. అటు టీడీపీ, ఇటు జ‌న‌సేన‌లోకి చేరుపోతున్నారు. అదీ ముఖ్యంగా ఉత్త‌రాంధ్ర‌, కోస్తా జిల్లాల్లో కావ‌ట‌మే వైసీపీ అధినేత జ‌గ‌న్ కు ఇబ్బంది క‌లిగించే అంశం. అయితే.. ఆయ‌న‌కు మ‌రో భ‌రోసా కూడా ఉంది. నేత‌లు త‌ర‌లిపోయినా.. జెండాలు మార్చినా.. త‌మ వెంట న‌డిచే కార్య‌క‌ర్త‌లు, వైఎస్ అభిమానులు మాత్రం ఉంటార‌ని.. నిజ‌మే కానీ.. ఇప్పుడు ఓట‌రు నాడి మారింది. బ‌ల‌మైన నేత‌లు.. త‌న వాడు అనుకున్న నాయ‌కుడు ఉన్న పార్టీవైపే మొగ్గుచూపుతున్నారు. 2014లో జ‌రిగింది కూడా అదే.. అదే సీన్ రిపీట్ గాకుండా ఉండేందుకు మున్ముందు సాధ్యం కాద‌నేది జ‌గ‌నెరిగిన స‌త్య‌మే. ఇదే కీల‌క‌మైన వేళ రాజ‌కీయ   వ్యూహ‌క‌ర్త‌గా తెర‌మీద‌కు తెచ్చిన‌.. ప్ర‌శాంత్‌కిషోర్ అదేనండీ.. పీకే కూడా.. జెండా పీకేస్తున్నార‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఏడాదికే అమ్మో.. జ‌గ‌న్ తో మ‌నం వేగ‌గ‌ల‌మా అంటూ.. పీకే లాంటి వ్య‌క్తికి కూడా త‌ల‌నొప్పి పుట్టింద‌నే ప్ర‌చార‌మూ విప‌క్షాలు చేస్తున్నాయి. ఉత్త‌రాధిన ఎన్నో పార్టీలు. సీనియ‌ర్ నేత‌లు త‌న మాట న‌మ్మినా.. జ‌గ‌న్ మాత్రం.. త‌న‌ను .. త‌న స‌ర్వేల‌ను ప‌ట్టించుకోవ‌ట్లేదంటూ వాపోతున్నార‌ట‌. పైగా.. త‌న వ‌ద్ద వ్య‌వ‌స్థ‌ను న‌డిపించేందుకు డ‌బ్బుల్లేవంటూ కూడా ఇటీవ‌ల ఐఎస్‌బీలో జ‌ర‌గిన స‌మావేశంలో గొంతెత్తారు. పైగా.. జ‌గ‌న్ త‌న‌కు 300-400 కోట్ల‌రూపాయ‌లు ఇచ్చారంటూ చేసేది కేవ‌లం ఊహాగానాలేనంటూ స‌మాధాన‌మిచ్చారు. ఇవ‌న్నీ ప‌క్క‌న‌బెడితే.
వైసీపీకు ఊహించ‌ని ప‌రిణామాలు.. ఒక‌టి కాకినాడలో కీల‌క‌మైన కాపు వ‌ర్గ నేత‌లు.. టీడీపీలోకి చేర‌టం.. కోస్తాలోనూ ఇదే దుస్థితి రిపీట్ అయ్యే అవ‌కాశాలుండ‌టం.. మింగుడుప‌డ‌కుండా ఉంద‌ట‌. ఇప్ప‌టికే.. త‌మ ఓటు బ్యాంకు స్థిరంగా ఉంద‌ని చాటుకునేంద‌కు వైసీపీ అధినేత‌.. ప్ర‌జాయాత్ర‌ల్లో బాగానే జ‌న‌స‌మీక‌ర‌ణ‌కు దిగుతున్నారు. ఎన్నిక‌ల‌కు ముందే ప్ర‌చారం ముగించాల‌నే త‌ప‌న‌తో అభ్య‌ర్థులు.. సారీ.. త‌మ‌కే టికెట్ వ‌స్తుంద‌ని ఆశ‌ప‌డుతున్న కేండిడెట్స్ కూడా బాగానే ఖ‌ర్చుచేస్తున్నార‌ట‌. అయితే.. ఇప్పుడు కొద్దిరోజులుగా గుంటూరు, కృష్ణా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇప్పి వ‌ర‌కూ వైసీపీ కో-ఆర్డినేట‌ర్లుగా ఉన్న వారికి స‌ర‌స‌న మ‌రో నాయ‌కుడికి చోటిచ్చి.. ఇద్ద‌రూ క‌ల‌సి చేసుకోండంటూ.. అధినేత జ‌గ‌న్ నుంచి కొత్త ఆదేశాలు రావ‌టం పాపం.. పాత నేత‌ల‌ను క‌ల‌వ‌ర‌పెడుతుంద‌ట‌. ఊరిని.. పెళ్లాంపిల్ల‌ల్ని వ‌ద‌లిపెట్టి.. ల‌క్ష‌లు ఖ‌ర్చుపెడితే.. ఇప్పుడీ కొత్త‌నేత‌లు.. త‌మ‌కు ఎస‌రు పెట్ట‌డం ఖాయ‌మంటూ.. మ‌రో బెర్త్ క‌న్‌ఫామ్ చేసుకునే ప‌నిలో కూడా ఉన్నార‌ట‌.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.