టీడీపీ బలహీనతతో వైకాపా గెలవలేదు…

తమ బలంతో గెలవాలని అనుకుంటారు. కానీ ఎదుటి వారి బలహీనతో తమ గెలుపు సులువు అనుకోకూడదు. ఏపీలో వైకాపా ఇదే పని చేస్తోంది. టీడీపీ చేసే తప్పులు తమకు కలిసి వస్తాయని భావిస్తోంది. కానీ అది అంత తేలికగా జరిగే వ్యవహారం కాదు. ఫలితంగా ఏపీలో ప్ర‌తిప‌క్షం తీరు ఆశ్చ‌ర్యంగా ఉంది. పాల‌క‌ప‌క్షం మీద పెరుగుతున్న వ్య‌తిరేక‌త‌నే ఆధారంగా చేసుకుని ఆపార్టీ సాగుతున్న తీరు చర్చనీయాంశమైంది. అధికార పార్టీపై ఉన్న అసంతృప్తితోనే తాము అధికారంలోకి వ‌చ్చేస్తామ‌నే భ్రమపడుతోంది. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ తమకు లాభిస్తుందని, అదే త‌మ‌కు చాలానే రీతిలో అతి విశ్వాసం వైసీపీలో కనపడుతోంది. అదే రేపు కొంపలు ముంచుతుందంటున్నారు ఆ పార్టీ నేతలు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను త‌మ‌కు సానుకూలంగా మ‌ల‌చుకోవ‌డంపై పెద్ద‌గా దృష్టిపెడుతున్న దాఖ‌లాలు లేవు. 
కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల మీదుగా గుంటూరుకు చేరింది ప్రజా సంకల్పయాత్ర. నరసరావుపేట నియోజకవర్గంలో ఆ యాత్ర కొనసాగుతోంది. జగ‌న్ ప‌ర్య‌టించిన జిల్లాల్లో ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన స్పంద‌నను తమకు అనుకూలంగా మలచుకోవడంలో వైకాపా విఫలమవుతోంది. ప్రజా సమస్యల పై పోరాటం లేదు. వారి కోసం పని చేసే ఓపిక లేదు. ఎంత సేపటికీ టీడీపీ నేతల పై మాటల దాటి తప్ప తాము ఏం చేస్తామో చెప్పడం లేదు. ఫలితంగా ప్రజల్లో జగన్ పార్టీ అంటే టీడీపీకి వ్యతిరేకంగా ఉందనే వాదన వస్తోంది. మేము ఏం చేస్తాం. ప్రజలను ఎలా ఆదుకుంటామనే అంశాన్ని పక్కన పెట్టింది వైకాపా. ఫలితంగా టీడీపీని నమ్మినట్లు వైకాపాను నమ్మేందుకు తటపటాయిస్తున్నారు. ఆ పార్టీ నేత‌ల మ‌ధ్య పెరుగుతున్న స‌మ‌న్వ‌యం పెద్ద స‌మ‌స్యగా మారింది. జ‌గ‌న్ ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాల ప‌థ‌కాన్ని కిందిస్థాయి ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డంలో వైసీపీ శ్రేణులు విఫ‌ల‌మ‌వుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.
నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో అతివిశ్వాసం ఆపార్టీ కొంప ముంచింది. ఆ తర్వాత వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేక చేతులెత్తేసింది. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ మూడో సీటుకు పోటీ చేస్తే అసలు మజా ఉండేది. కాకపోతే చంద్రబాబు ముందస్తు వ్యూహంతో ఆ సీటును కాదనుకున్నాడు. లేకపోతే మరో రచ్చ జరిగేది. ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం విష‌యంలో వైకాపా చాలా ముందు ఉంది. కానీ మొన్న హోదా ఉద్యమంలోకి వచ్చిన చంద్రబాబు రోజు మీడియాలో నానుతూ అంతా తానే పోరాడుతున్నట్లు చెబుతున్నాడు. చాలాకాలంగా అదే పని చేస్తున్న వైకాపా ఈ విషయంలో వెనుకబడుతోంది. సమస్యను తమకు అనుకూలంగా మ‌ల‌చుకోవ‌డంలో ఆ పార్టీలో నైరాశ్యం క‌నిపిస్తోంది. అన్ని పార్టీలు ఒకే నినాదంతో సాగుతున్న స‌మ‌యంలో మ‌రింత జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం. కానీ అది కొరవడింది. ఇన్నాళ్ల శ్ర‌మ ఫ‌లితం మ‌రో పార్టీకి మేలు చేసే రీతిలో వెళుతుంద‌నే అనుమానాలు మొద‌ల‌య్యాయి. ఇలాంటి ప‌రిస్థితి మార్చుకోక‌పోతే వైకాపాకు న‌ష్టం త‌ప్ప‌ద‌నే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోసారి అతి విశ్వాసంతో వ్య‌వ‌హ‌రిస్తే 2014 ఎన్నికల ఫలితాలు రిపీట్ అయ్యే వీలుందంటున్నారు. క్షేత్ర‌స్థాయిలో కార్యాచ‌ర‌ణ లేకుండా అధినేత అడుగుల‌తోనే అధికారం ద‌క్కుతుంద‌నే ఆలోచన మానుకుంటే మంచిది. లేకపోతే మరికొన్నేళ్లు అధికారానికి దూరంగా ఉంటారనే వాస్తవం. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.