ప్రధానిని కలిసింది అందుకేనట

టీడీపీ అధినేత, సి.ఎం చంద్రబాబును బోనులో పెట్టేందుకు వైకాపా పావులు కదుపుతోంది. ఈ విషయాన్ని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అధికారికంగా ప్రకటించారు. ప్రధాని మోడీ కార్యాలయం చుట్టూ తిరిగేది అందుకేనని చెప్పారు. గత నాలుగేళ్లలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్పు రూ.1.2 లక్షల కోట్ల పెరిగింది. రూ.97 వేల కోట్ల నుంచి అది పెరగటం ఇబ్బంది అని చెబుతున్నారాయన. కేంద్రం ఇచ్చిన నిధులకు చంద్రబాబు లెక్కలు చెప్పడం లేదట. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్లాయి.. ఏం చేశారనే విషయాన్ని తెలుసుకునేందుకు కూపీ లాగుతున్నారట. ఇవన్నీ ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లారు వైకాపా నేతలు. చట్టప్రకారం చంద్రబాబుపై చర్యలు తీసుకునేంత వరకూ చేయాల్సిందంతా చేస్తాం’ అని ఆయన అనడం హాట్ టాపికైంది. ఎంపీగా తాను ప్రధానిని కలుస్తా.. మంత్రులను కలుస్తా. ఆ హక్కు నాకు ఉందని చెప్పారాయన. 
సీఎం కోరికమేరకే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది కేంద్రం. ఇదే విషయాన్ని రాజ్యసభలో విజయసాయిరెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. ఆ సంగతి మరోసారి చెప్పారాయన. కేంద్రం ఇస్తేనే తాను తీసుకున్నట్లు చంద్రబాబు బుకాయిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే చంద్రబాబు చెప్పే మాటలు నిజం కాదనేది వైకాపా ఆరోపణ. ఏపీకి హోదా విషయంలో మొదటి నుంచి తాము పోరాడుతున్నామని టీడీపీ మాట మార్చిందని చెబుతున్నారు విజయసాయి…
కేసులు చాలానే పెట్టారు…
దివంగత సిఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలంలో.. ఆ తర్వాత తమపై కేసులు చాలానే పెట్టారు. అయినా ఏ ఒక్కటీ నిరూపణ కాలేదంటున్నారు మరోవైపు చంద్రబాబు. నీతిమంత రాజకీయాలు చేయడంలో టీడీపీని చూసే నేర్చుకోవాలంటున్నారు బాబు. ఫలితంగా ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య వాతావరణం మరింత వేడిగా మారింది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.