నేపాల్ కు వెళ్లిన వైకాపా ఎమ్మెల్యేలు

రాజ్యసభ సీటు దక్కించుకునేందుకు వైకాపా అధినేత జగన్ వ్యూహాత్మకంగా పావులు కదిపారు. ఢిల్లీలో ధర్నాకు వచ్చిన ఎమ్మెల్యేలను ఆయన నేపాల్ దేశానికి పంపారు. అక్కడ వారి అవసరాలన్నింటినీ వైకాపా చూస్తోంది. మూడో సీటు కోసం పోటీ చేస్తున్న వైకాపా నేత, నెల్లూరు జిల్లాకు చెందిన పారిశ్రామిక‌వేత్త అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇప్పటికే 44 మంది ఎమ్మెల్యేలు ఆపార్టీకి ఉన్నారు. అవసరానికి మించి మరో నలుగురు ఉన్నా.. గెలుపు కోసం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది వైకాపా. అందుకే వారిని క్యాంప్ రాజకీయాలకు పంపింది. వారికయ్యే ఖర్చంతా ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి పెడుతున్నారట. సింగపూర్, అమెరికా వంటి దేశాలకు తీసుకెళితే ఖర్చు ఎక్కువ అవుతుందని.. అందుకే సింపుల్ గా నేపాల్ దేశానికి పంపారంటున్నారు. మన కరెన్సీతో పోల్చుకుంటే ఖర్చు తక్కువ. అదే సమయంలో అక్కడి ప్రాంతాలను చూసినట్లు ఉంటుందని భావిస్తున్నారు. 
టీడీపీ మంత్రుల రాజీనామాతో వైకాపా అప్రమత్తమైంది. హోదా మైలేజ్ కొట్టేద్దామనుకుంటే టీడీపీ తోడుగా వచ్చింది. ఫలితంగా జనాలు ఎటువైపు మొగ్గు చూపుతారో అర్థం కాని పరిస్థితి. అందుకే ముందు రాజ్యసభ సీటు సాధించేందుకు పావులు కదుపుతోంది. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేల ఓట్లను వైకాపా అడుగుతున్నట్లు సమాచారం వస్తోంది. ఇంకా అది చర్చల దశలోనే ఉందంటున్నారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఈ చర్చల ప్రక్రియను చాలా రహస్యంగా చేస్తున్నారని తెలుస్తోంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.