త‌ల్లి కాంగ్రెస్ నేత‌ల‌కు.. పిల్ల హ‌స్తం గాలం!

కాంగ్రెస్‌తో టీడీపీ జ‌త‌క‌ట్టినా.. లోపాయికారీ ఒప్పందంతో సీట్ల పంపిణీ జ‌రిగినా… వైసీపీ కోలుకోలేని దెబ్బ‌తినాల్సి వ‌స్తుంది. పైగా 2024 వ‌ర‌కూ దాన్నుంచి బ‌య‌ట‌ప‌డ‌టం క‌ష్టం కూడా.. అందుకే.. త‌మ బ‌లం పెంచుకోవ‌టం.. ప‌నిలో ప‌నిగా.. హ‌స్తం బ‌ల‌హీనమ‌య్యేలా చేయ‌టం.. ఒక్క దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అనే కోణంలో అధినేత జ‌గ‌న్ వ్యూహాల‌కు ప‌ద‌ను పెడుతున్నాడు. హ‌స్తం కాస్త ఓటుబ్యాంకు.. స‌త్తా ఉన్న నేత‌ల‌ను ప‌ద‌వుల ఆశ‌తో త‌న‌వైపు తిప్పుకునేందుకు రంగంలోకి దిగార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతుంది. ఇప్ప‌టికే కొంద‌రు మాజీ నేత‌లు కూడా ఫ్యాన్ రెక్క‌ల కింద ఇమ‌డ‌లేమంటూ జెండా మార్చారు. సో.. పోయిన ప‌రువు రాబ‌ట్టుకునేందుకు ఎలాగైనా.. సీనియ‌ర్ నేత‌ల‌ను ఇత‌ర పార్టీల నుంచి రాబ‌ట్టాల‌నేది మాస్టార్ ప్లాన్ అట‌. దానిలో భాగంగానే ఇటు ఉత్త‌రాంధ్ర నుంచి అటు సీమ వ‌ర‌కూ.. అవ‌కాశం ఉన్న నేత‌ల‌కు తీయ‌టి వ‌ల విసిరి.. త‌మ పార్టీ కండువా క‌ప్పే ప‌నిలో బిజీగా మారార‌ట‌. ఉత్త‌రాంధ్ర‌లో రాజాం మాజీ ఎమ్మెల్యే కొండ్రు మురళి ఇటీవ‌ల తాను పార్టీ మార‌తానంటూ ప్ర‌చారం చేసుకుంటున్నారు. మాజీ స్పీక‌ర్ ప్ర‌తిభా భార‌తి ద్వారా సైకిల్ ఎక్క‌బోతున్నారు.
ఉత్త‌రాంధ్ర‌లో ఒక్క వ‌ల‌స నేత పెరిగినా.. ఆ పార్టీవైపు ఓట‌ర్లు మొగ్గుచూపుతారు. ఇది.. టీడీపీ, వైసీపీ రెండు పార్టీల‌ను ఆందోళ‌న‌కు గురిచేసే అంశం కూడా. పైగా.. బొత్స కూడా ప్ర‌త్యామ్నాయం వైపు చూస్తున్నాడు. వైసీపీలో ఇమ‌డ‌లేక‌.. తిరిగి హ‌స్తం గూటికి చేర‌బోతున్నార‌నే పుకార్లు కూడా వెలువ‌డుతున్నాయి. గోదావ‌రి జిల్లాలోను వైసీపీ నుంచి క‌న్న‌బాబు, పులి సుబాష్‌చంద్ర‌బోస్ త‌దిత‌రులు కూడా వేరే పార్టీ మారాల‌నే యోచ‌న‌లో ఉన్నార‌ట‌. ఇదే జ‌రిగితే. వీరివెంట మ‌రికొంద‌రు నేత‌లు క్యూక‌ట్ట‌వ‌చ్చు. ప్ర‌కాశం జిల్లాలో టీడీపీ వ‌ర్గ‌పోరు త‌మ‌కు అనువుగా మ‌ల‌చుకోవాల‌నుకున్నా.. మాజీ ఎమ్మ‌ల్యే ఉగ్ర‌న‌ర‌సింహారెడ్డి సైకిల్ ఎక్కాల‌ని ముచ్చ‌ట‌ప‌డుతున్నాడు. ఇటీవ‌ల తానే స్వ‌యంగా క‌ల‌సి చంద్ర‌బాబుకు త‌న మ‌న‌సులో మాట వెలిబుచ్చాడు.  ప్ర‌స్తుతం అదే నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే గా కదిరి బాబూరావు వున్నారు. టీడీపీకు చెందిన ఈయ‌న ప్రాబ‌ల్యం కూడా బాగానే ఉంది. పైగా నంద‌మూరి బాల‌య్య‌కు మంచిమిత్రుడు. ఒక‌వేళ చంద్ర‌బాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో రెడ్డి వ‌ర్గం కోసం.. ఉగ్ర‌న‌ర‌సింహారెడ్డికి సీటిస్తే.. నంద‌మూరి, నారా కుటుంబాల మ‌ధ్య కొత్త గొడ‌వ‌ల‌కు శ్రీకారం చుట్టిన‌ట్టవుతుంది. పైగా.. ఇద్ద‌రూ వియ్యంకులు కూడా.  గుంటూరు జిల్లాలోనూ బీజేపీ, వైసీపీల‌కు ఝ‌ల‌క్ ఇస్తూ కొంద‌రు కాపు నేత‌లు.. జ‌న‌సేన‌లో చేరేయోచ‌న‌లో ఉన్నారు. ఇది టీడీపీ కంటే.. వైసీపీపైనే ప్ర‌భావం చూపుతుంద‌నే ఆందోళ‌న కూడా ఉంది. వీట‌న్నింటినీ అధిగ‌మించి పోయిన బ‌లం తిరిగి పుంజుకునేందుకు వైసీపీ ఎంచుకున్న మార్గం.. కాంగ్రెస్ సీనియ‌ర్ల‌కు వ‌ల‌..!!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.