వైసీపీ చీప్ ట్రిక్స్.. టీడీపీ కార్యకర్త ఆవేదన

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన దాడి సంచలనం అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి రోజుకో విషయం బయటికి వస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా కలకలం రేపిన ఈ దాడిని అధికార పక్షం అత్యంత జాగ్రత్తగా డీల్ చేస్తుంటే వైసీపీ మాత్రం బాగా వాడుకుంటోంది. దాడి చేసిన శ్రీనివాసరావుకు టీడీపీ నేతలతో సంబంధాలు ఉన్నాయని, లోకేష్, చంద్రబాబుతో అతడు ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడని మార్ఫింగ్ చేశారు. అది కూడా ఏపీ డీజీపీ విడుదల చేసిన ఫొటోతో. ఇదే కాదు ఎవరో టీడీపీ మీటింగ్‌లో ఉన్న ఫొటోను రౌండప్ చేసి ఈయనే శ్రీనివాస్.. ఈయన టీడీపీ కార్యకర్త అంటూ షేర్లు చేశారు. అంతేనా.. వైసీపీ అభిమానులు ఇక్కడితో ఆగిపోలేదు. జగన్‌పై దాడి చేసిన వ్యక్తికి టీడీపీ సభ్యత్వం ఉన్నట్లు గుర్తింపు కార్డు విడుదల చేశారు. అయితే ముమ్మిడివరం నియోజకవర్గంలో ఉన్న ఆ గ్రామాన్ని అమలాపురం అసెంబ్లీ పరిధిలో ఉన్నట్లు చూపారు. దీనిపై లోకేషే స్వయంగా క్లారిటీ ఇచ్చారు.

తాజాగా ఆ గుర్తింపు కార్డులోని ఒరిజినల్ వ్యక్తి బయటికొచ్చాడు. వైసీపీ నేతలు చేసిన పనికి ఆవేదన వ్యక్తం చేశాడు. టీడీపీ నాయకులు ఆ వ్యక్తికి సంబంధించిన వివరాలు తెలుసుకుని మరీ మీడియా ముందుకు తీసుకొచ్చారు. ఈయన గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలంలోని గణపవరం గ్రామానికి చెందిన అంకాలు నిరుపేద గిరిజన కూలి. జగన్ దాడి ఘటనలో తన టీడీపీ సభ్యత్వ కార్డును వాడుకోవడంతో తీవ్ర బావోద్వేగానికి గురయ్యాడు. తాను చిన్ననాటి నుంచే ఎన్టీఆర్ అభిమానినని, సినిమాల నుంచి రాజకీయాలలోకి వచ్చిన తర్వాత కూడా నేను ఎన్టీఆర్‌ అభిమానిగానే కొనసాగుతున్ననని చెప్పారు. అలాగే ఓటు పుట్టిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకే వేస్తూ వీరాభిమానిగా ఉన్నానని, చనిపోయే వరకు ఆ పార్టీ కార్యకర్తగానే ఉంటానని కన్నీటి పర్యంతమయ్యారు. తన కార్డును వాడుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుకుంటున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతపై దాడిని ఆ పార్టీ నేతలు ఈ విధంగా వాడుకోవడం ఏమోగానీ ఇలాంటి చర్యల వల్ల రాష్ట్రంలో ఘర్షణలు ఏర్పడే అవకాశాలున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.