వైసీపీ బ్రాహ్మ‌ణ ఆత్మీయ స‌మ్మేళ‌నం ఓ ప్లాప్ షో…జ‌గ‌న్ భ‌జ‌న‌కు వేదిక‌

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో జరిగిన “బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనాన్ని” ఒక ఫ్లాప్ షో గా, ఫార్స్ అనే విష‌యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని ఏపీఎన్నార్టీ చీఫ్ కో ఆర్డినేట‌ర్ బుచ్చిరాంప్ర‌సాద్ వ్యాఖ్యానించారు. అణువణువున బ్రాహ్మణ ద్వేషం నిండిన వైఎస్ఆర్ కాంగ్రెస్ అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.   జగన్ మోహన్ రెడ్డి బ్రాహ్మణులను రాజమండ్రిలోను, అనకాపల్లిలోను దారుణంగా అవమానించి, వారి మనోభావాలను తీవ్ర స్థాయిలో దెబ్బతీసిన  దరిమిలా  నష్ట నివారణ కోసం తప్పనిసరి అయి అన్యమనస్కంగా ఈ సభను నిర్వహించినట్లు బుచ్చిరాంప్ర‌సాద్ తెలిపారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఎంతోకాలంగా  ఊదర కొడుతూ వచ్చిన “బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం”  వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ స్వోత్క‌ర్ష‌కు వేదిక‌గా మారింద‌ని బుచ్చి రాంప్ర‌సాద్ స్ప‌ష్టం చేశారు. చిత్త‌శుద్ధి క‌లిగిన‌ బ్రాహ్మ‌ణ నాయ‌కులు ఎవ‌రూ పాల్గొన‌లేద‌ని 15-20 సంఘాలకు చెందిన వారు మాత్ర‌మే హాజ‌ర‌వ‌డం ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌న్నారు. బ్రాహ్మణుల పేరుతో,  బ్రాహ్మణులలో ఏ మాత్రం పలుకుబడి లేని టి  కొందరు తాబెదారులను, ఆ పార్టికి చెందిన కొంత మంది కార్యకర్తలను పోగు చేసిన జనం మాత్రమే పాల్గొన్న ఈ సమావేశం అత్యంత పేలవం గా ముగిసింది. అధినేత దగ్గర తమ ప్రాబల్యాన్ని నిరూపించుకోవడానికి వారు చేసిన ప్ర‌య‌త్నం విఫ‌ల‌మైన తీరు అంతంత మాత్రంగా హాజ‌రైన జ‌నాల‌తో స్ప‌ష్టంగా క‌నిపించ‌ద‌ని బుచ్చిరాంప్ర‌సాద్ వెల్ల‌డించారు. ఈ సభలో పాల్గొన్న వారిలో అధిక సంఖ్యాకులు బ్రాహ్మణులు కాక పోయే అవకాశం ఎక్కువగా ఉంద‌నే భావ‌న కొంద‌రు బ్రాహ్మ‌ణోత్త‌ముల‌లో ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు
సభికులకు అభిప్రాయాలు తెలపడానికి అవకాశం నామమాత్రంగా ఇచ్చి తొందరగా ముగించిన ఈ సమావేశం ఆద్యంతం జగన్మోహన్ రెడ్డిని పొగడడానికే సరిపోయింది. దీంతో ఇది బ్రాహ్మ‌ణుల కోసం ఏర్పాటు చేసిన స‌మావేశం కాద‌ని….వైసీపీ రాజకీయ అవ‌స‌రాల‌ కోసం ఏర్పాటు చేసిన స‌మావేశం అని బుచ్చిరాంప్ర‌సాద్‌ స్ప‌ష్టం చేశారు. ప్రజా రంజకంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగుతుంటే,  ఇప్పుడు తానేదో ఊడబోడుస్తానని ycp పేర్కొనడం అత్యంత హాస్యాస్పదమ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.
ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు గారి చల్లని నీడలో ఎన్నడు లేనంత హాయిగా బ్రాహ్మణులంతా జీవిస్తున్నారని బుచ్చిరాంప్ర‌సాద్ స్ప‌ష్టం చేశారు. ఇందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ఎన్నో ప‌థ‌కాలే నిద‌ర్శ‌నమ‌ని వెల్ల‌డించారు. రాష్ట్రంలోని బ్రాహ్మణుల వెతలను అర్ధం చేసుకొని, హామీ ఇచిన మేరకు బ్రాహ్మణ కార్పోరేషన్ నెలకొల్పి  క్రమం తప్పకుండా బడ్జెట్లో నిధులు కేటాయించి పధకాలను బ్రాహ్మణుల మనసును గెలిచిన ఏకైక నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. “గాయత్రి విద్యా ప్రశస్తి”  “భారతి విద్యా పధకం” “వేదం వ్యాస విద్యా పధకం” క్రింద విద్యార్ధులకు ప్రోత్సాహకాలు, ఉపకార వేతనాలు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సార‌థ్యంలో ప్ర‌భుత్వం అందజేస్తోంద‌ని ఆయ‌న తెలిపారు. వేద విద్యాభ్యాసాన్ని ప్రోత్సహించడానికి “వేదవ్యాస” పధకం అమలు చేస్తున్నామని, అదే రీతిలో సివిల్ సర్వీసెస్, గ్రూపు-1, బ్యాంకు అధికారులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలకు హాజరయ్యే బ్రాహ్మణ యువతకు “వసిష్ఠ” పథ‌కం క్రింద ఆర్ధిక సహకారాన్ని అందజేయడం జరుగుతోంది. అలాగే బ్రాహ్మణ యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు “ద్రోణాచార్య” పధకం పేరిట గుర్తింపు పొందిన సంస్థలలో బ్రాహ్మణ యువతీ యువకులకు శిక్షణ ఇప్పించడం జరుగుతున్నది. బ్రాహ్మణ యువత కేవలం ఉద్యోగాల వేటకే పరిమితం కాకుండా వారిలోని వాణిజ్య వ్యాపార కాంక్షలు నిజం చేయడానికి “చాణక్య” పధకం క్రింద వ్యాపార, పారిశ్రామిక సంస్థలు నెలకొల్పదలచుకున్న యువతకు సబ్సిడీ తో కూడిన రుణాల మంజూరు చేస్తున్నాము.
ఇక బ్రాహ్మ‌ణుల సంక్షేమం కోసం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అనేక నిర్ణ‌యాలు తీసుకున్నార‌ని బుచ్చిరాంప్ర‌సాద్ వివ‌రించారు. “కశ్యప” పధకం పేరిట పేద, 14 ఏళ్ళ లోపు అనాధ బాల బాలికలకు, వికలాంగుల‌కు, వితంతువులకు మరియు 60 ఏళ్ళకు పై బడిన వృద్ధులకు నెలకు 1,000 చొప్పున పెన్షన్లు అందజేస్తున్న ఘ‌న‌త టీడీపీ ప్ర‌భుత్వానిదే.  గుర్తింపు పొందిన వృద్దాశ్రమాలలో  నివసిస్తున్న వృద్ధులకు నెలకు 3,000 రూపాయల వంతున సహాయం అందజేస్తున్నారు.  అలాగే 50 సంవత్సరాలు దాటినా వివాహం కాని లేదా ఒంటరిగా జీవిస్తున్న పేద బ్రాహ్మణ మహిళల కోసం నెలకు వేయి రూపాయల పెన్షన్ అందజేస్తున్నాము. అంత్యక్రియలకు కూడా నోచుకోని నిరుపేద బ్రాహ్మణులు ఎవరైనా మరణించినప్పుడు అంత్యక్రియల ఖర్చు కోసం “గరుడ” పధకం క్రింద రూ. 10,000 సహాయం అంద  జేయడం జరుగుతున్నది. ఇవే కాకుండా శ్రీ కృష్ణ సుధామ దాన నిధి, అక్షయ బ్రాహ్మణ నిధి వంటి పధకాలు కూడా అమలు జరుగుతున్నాయి. ఇవ‌న్నీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుగారికి బ్రాహ్మ‌ణుల సంక్షేమ ప‌ట్ల ఉన్న చిత్త‌శుద్ధికి నిద‌ర్శ‌నం. అర్హులైన బ్రాహ్మణులకు ఈ సంక్షేమ పథ‌కాలన్ని 13 జిల్లాలలో గత 3 సంవత్సరాలుగా  సంతృప్త స్థాయిని మించి అత్యంత పారదర్శకమైన రీతిలో అందజేయడం జరిగింది. ఇంతే కాకుండా మరిన్ని సంక్షేమ పధకాలకు రూపకల్పన చేయవలసిందిగా సీఎం చంద్ర‌బాబు ఆదేశించారు. చిత్తశుద్దిలేని వైసీపీ నాయకుల కల్లబొల్లి  మాటలు నమ్మే స్థితిలో రాష్ట్రంలోని బ్రాహ్మణ్యం లేదు అని తెలుసుకోవాలని బుచ్చిరాంప్ర‌సాద్‌ కోరారు.
ఏదైనా రాజ‌కీయ పార్టీ వివిధ సామాజిక‌వ‌ర్గాల‌తో స‌మావేశం అవ‌డంలో ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని, అయితే స‌ద‌రు స‌మావేశాలు దురుద్దేశ‌పూర్వ‌కంగా ఉండ‌ట‌మే స‌హేతుకం కాద‌ని బుచ్చిరాంప్ర‌సాద్ అన్నారు. వివిధ వ‌ర్గాల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు- ప‌రిష్కారాలు, నూత‌న‌ ప్ర‌తిపాద‌న‌ల‌తో ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు తాను నివేదించిన‌ట్లు ఆయ‌న ఈ సంద‌ర్భంగా వివ‌రించారు. మ‌రిన్ని సంక్షేమ ప‌థ‌కాల కోసం తాను విన్న‌వించిన‌ట్లు పేర్కొన్నారు. 
బుచ్చి  రామ్ ప్రసాద్ , చీఫ్ కోఆర్డినేటర్ , APNRT(USA) 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.