బీజేపీ నేతలు జగన్ ను తిట్టరట

ఏపీ బీజేపీకి ఇరకాటమైన పరిస్థితి. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వెళ్లలేదు. అయినా సరే టీడీపీని తిట్టవచ్చునట. అదే సమయంలో వైకాపాను ఒక్క మాట అనవద్దని కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చాయని తెలుస్తోంది. అదేంటి.. మనపై వైకాపా అవిశ్వాస తీర్మానం పెడుతుంది కదా. ఆ పార్టీని ఏం అనకపోతే ఎలా అని కార్యకర్తలు అడుగుతున్నారు. అది అంతే. అధిష్టానం ఆదేశాలను మనం తూచా తప్పకుండా పాటించాలి. మీరు టీడీపీ, చంద్రబాబు, మిగతా నేతలను ఎన్ని మాటలు అయినా అనండి. జగన్ అండ్ కోను ఒక్క అనడానికి వీలు లేదని బీజేపీ ఏపీ అధ్యక్షులు కంభంపాటి హరిబాబు చెప్పారు ఆ పార్టీ నేతలకు. ఆ మాటలతో వారు బిత్తరపోయారట. అదేంటి మరీ ఇంత అన్యాయమా. నిన్నటి దాకా వైకాపా పై మాటల దాడి చేయమని చెప్పారు. ఇప్పుడు అదే పార్టీని కాపాడుకోవాలని… టీడీపీపై దాడి చేయాలని చెబుతున్నారని నేతలు ప్రశ్నించారు. 
అదంతా మీకు ఎందుకు. పార్టీ స్టాండ్ ఇది. అందుకే మీరు అదే ఫాలో అవ్వాలని చెప్పారు. బీజేపీతో..వైకాపా బంధం మరింత ధృడంగా ఉందని తెలుస్తోంది. విజయసాయిరెడ్డి మాటి మాటికి ప్రధాని కార్యాలయం వద్దకు ఎందుకు వెళుతున్నారో అర్థమవుతోంది. పైకి చెప్పక పోయినా లోపాయికారీ ఒప్పందం ఆ పార్టీతో జరిగిందని తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో బీజేపీ-వైసీపీ కలిసిపోటీ చేస్తాయట. వెంకయ్యనాయుడు సైతం ఈ బంధంపై పెదవి విరిచినా.. ఆయన పార్టీలో లేరు కాబట్టి చెల్లుబాటు కావడం లేదు. వ్యూహాత్మకంగానే టీడీపీని గెంటేసేలా బీజేపీ వ్యవహరిస్తుందంటున్నారు. ఏపీకి హోదా ఇవ్వకుండా ప్రజలను ఆకట్టుకోవడం బీజేపీ తరం కాదు. అదే టీడీపీకి ప్లస్ పాయింట్ అవుతుందని చెబుతున్నారు జనాలు. 
 

1 Comment

  1. modi, jagan enni ettulu vesina ycp ki , bjp ki andhra prajalu vote veyyaru. bjp politics chuste desam navutundanna siggu kuda lekunda baga bari tegincharu. thoooo…………mee batukullu cheda

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.