వైసీపీ.. ‘యాత్ర’పై ఆశలు వదులుకోవాల్సిందే

దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘‘యాత్ర’’. 70 ఎంఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై విజ‌య్ చిల్లా, శశిదేవి రెడ్డి నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రాన్ని మ‌హి వి రాఘ‌వ్ తెరకెక్కనున్నాడు. మళయాల సూపర్ స్టార్ మమ్ముట్టి వైఎస్సార్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ పాత్ర కోసం ఆయన వైఎస్‌కు సంబంధించిన పలు వీడియోలు చూడడంతో పాటు ఎంతో కసరత్తు చేశాడు. ఒక పక్క ఈ సినిమాకు, ప్రస్తుత రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని చిత్ర బృందం చెబుతున్నా.. టీజర్ చూసిన తర్వాత ఈ సినిమా గురించి సగటు ప్రేక్షకుడికి అర్థమైపోయింది. ఎన్నికల ఏడాదిలో విడుదల కాబోతున్న ఈ సినిమా వైఎస్ పాదయాత్ర సృష్టించిన ప్రభంజనంలాగే విజయం సాధిస్తుందని చిత్ర బృందం ఆశాభావంతో ఉంది.

మరోపక్క ఈ సినిమాను వైసీపీనే తీయిస్తుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పాదయాత్రతో తన తండ్రి ఎంతటి ఘన విజయం సాధించారో.. ఇప్పుడు ఈ సినిమాతో జగన్ ఏపీలో సీఎం కావాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ టీజర్ చూసిన తర్వత మాత్రం చాలా మంది అంచనాలు మారిపోయాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంత వరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్‌కు సంబంధించిన వ్యక్తే. ఆయన కాంగ్రెస్ విజయం కోసమే పాదయాత్ర చేశారు. సినిమాలో కూడా అలాగే చూపించాలి. ఒకవేళ అలా చూపించకపోతే వైఎస్సార్‌పై నెగెటివ్ ఒపీనియన్ వస్తుంది. ఉన్నది ఉన్నట్లే చూపిస్తే అది కాంగ్రెస్‌కే ప్లస్ అవుతుంది. కాబట్టి ‘యాత్ర’ వల్ల వైసీపీకి మేలు జరిగే కంటే నష్టమే జరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.