బొత్స‌.. ధ‌ర్మాన సోద‌రుల క్రేజ్ త‌గ్గుతుందా!

విజ‌య‌న‌గ‌రం.. సికాకుళంలోనూ.. చక్రం తిప్ప‌గ‌ల నేత‌లు. ఏళ్ల‌త‌ర‌బ‌డి శాసించిన బ్ర‌ద‌ర్స్ ఇప్పుడు.. అధినేత ద‌యాదాక్షిణ్యాల‌పై రాజ‌కీయాలు చేయాల్సి వ‌స్తోంది. ఇది.. మ‌న‌సుకు ఇబ్బందిగా వున్నా త‌ప్ప‌నిప‌రిస్థితుల్లో ఈ బ్ర‌ద‌ర్స్ ఆ పార్టీలో కొన‌సాగుతున్నార‌ట‌. ఇంత‌కీ.. ఆ బ్ర‌ద‌ర్స్ ద‌ర్మాన అండ్ బొత్స సోద‌రుల బృందం. బొత్స   ఎంత చెబితే అంత‌.. సొమ్ములు పోనాయి మ‌రీ ఏటి చేత్తామంటూ కాంగ్రెస్ పార్టీ హ‌యాంలో వోక్స్ వ్యాగ‌న్ కంపెనీ త‌ర‌లిపోయిన‌పుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ మంత్రిహోదాలో అన్న‌మాట‌లు. వైఎస్ మ‌ర‌ణంతో దాదాపు బొత్స‌, ధ‌ర్మాన సోద‌రుల హ‌వా త‌గ్గుతూ వ‌చ్చింది. రోశ‌య్య‌, కిర‌ణ్‌కుమార్‌రెడ్డి ఇద్ద‌రూ దూరంగానే ఉంచారు. దీంతో చివ‌ర‌కు వై ఎస్ త‌న‌యుడు జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి పంచ‌న చేరారు. ఇప్పుడు.. నామ‌మాత్ర‌పు ప్రెస్‌మీట్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు.  అదీ సాక్షి మీడియాలో చూపించే వార్త‌ల్లో మిన‌హా ఎక్క‌డా లేర‌నే చెప్పాలి.  వాస్త‌వానికి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్లు కూడ‌బెట్టార‌నే నేత‌ల్లో ఈ ఇద్ద‌రి నేత‌లు.. వారి బంధుగ‌ణం కూడా ఉంది. సీబీఐ కేసుల్లో జ‌గ‌న్ కోట‌రీలో ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు పేరు కూడా ఉంది. అదృష్ట‌వ‌శాత్తూ బ‌య‌ట‌ప‌డినా.. మున్ముందు సీబీఐ పేరు చేర్చేందుకు అవ‌కాశాలున్నాయి. తూర్పు కాపు వ‌ర్గానికి చెందిన ఈ నేత‌ల‌ను వైసీపీ భ‌రించ‌టానికి.. జ‌గ‌న్ ప్ర‌యార్టీ ఇవ్వ‌టానికి కార‌ణం కేవ‌లం కాపుల ఓట్లే.
కానీ.. ఇటీవ‌ల రిజ‌ర్వేష‌న్స్ విష‌య‌మై నోరుజారిన జ‌గ‌న్ పై కాపు వ‌ర్గంలో న‌మ్మ‌కం త‌గ్గుతూ చివ‌ర‌కు ప‌రాకాష్టకు చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కూ కాపు వ‌ర్గంలో పాపులారిటీ సంపాదించి.. అవే ఓట్ల‌తో గెలిచిన నేత‌ల్లో ఇప్పుడు కొత్త భ‌యం ప‌ట్టుకుంది. ఆ జాబితాలో ధ‌ర్మాన‌, బొత్స కుటుంబాలు కూడా ఉండ‌ట‌మే ఇందుకు కార‌ణం. ఇప్ప‌టికే ప‌లు అవ‌మానాల‌తో ఇబ్బందిప‌డుతున్న బొత్స అద‌ను చూసి పార్టీ మారాల‌నే యోచ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. రాజ‌కీయంగా భ‌విష్య‌త్తు లేక‌పోతే.. ఇబ్బందులు త‌ప్ప‌వ‌నే భ‌య‌మే దీనికి కార‌ణంగా తెలుస్తుంది. ఈ విష‌య‌మై బొత్స త‌న అనుచ‌రుల‌తో మంత‌నాలు జ‌రిపిన‌ట్లు స‌మాచారం. బీజేపీలోకి చేరేందుకు ఆ పార్టీ ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. జ‌న‌సేన‌లోకి చేరాలంటే.. ర‌మ్మంటారా.. అక్క‌డా అవ‌మానాలు త‌ప్ప‌వా అనే ఆందోళ‌న‌.. అనుమానం నెల‌కొంది. ఇప్పుడు ఎన్నిక‌ల స‌మ‌యం ముంచుకు రావ‌టంతో ఏదోఒక నిర్ణ‌యం తీసుకోవాల‌ని ఈ సోద‌రుల బృందం ఆలోచిస్తుంద‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.