పొత్తుకు బీటలు వారినట్లేనా…

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం మంచిది కాదని ఏపీ శాసనసభలో బిజెపి పక్ష నేత విష్ణుకుమార్ రాజు అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే మాటకు తాను కట్టుబడి ఉన్నానని మరోసారి చెప్పారు బీజేపీ నేత. తాను వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు అనుకూలంగా మాట్లాడలేదని చెప్పారు. వైకాపా పార్టీ కార్యాలయంలో కూర్చుంటే బీజేపీ, వైసీపీ కలిసిపోతాయని అనుకోవడం సరికాదన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ రావాలని ఉత్తరాంధ్ర వాసిగా తాను కోరుకుంటున్నట్లు చెప్పారు బీజేపీ నేత.
కొద్దిరోజులు వేచి చూస్తే అంత తేలిపోతుందని నర్మగర్భంగా చెప్పారు కమలం నేత. ఏపీలో నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అనైతికంగా ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడు మంత్రి పదవులు ఇచ్చారనే సంగతిని పదే పదే చెబుతున్నారు బీజేపీ నేతలు. వైకాపా నేతలు చెప్పి చెప్పి అసలు చెప్పడమే మానుకున్నారు. కానీ బీజేపీ ఇప్పుడు కొత్తగా అదే పల్లవి అందుకుంది. టీడీపీ అధినేత, సి.ఎం చంద్రబాబు మా దారి మేము చూసుకుంటామని చెప్పిన తర్వాత దూకుడు పెంచింది బీజేపీ.
పార్టీ పెద్దల నుంచి వచ్చిన సంకేతాలే ఇందుకు కారణమంటున్నారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చేసిన మోసాన్ని మేం మర్చిపోలేమని ఇంకోవైపు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అంటున్నారు. మేం కూడా మిత్రధర్మమే పాటిస్తున్నాం. టీడీపీయే పాటించడం లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధిని టీడీపీ ప్రభుత్వం చేసినట్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నిధుల సేకరణపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్వేతపత్రం విడుదల చేయాలని వీర్రాజు డిమాండ్ చేశారు. 
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషితోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతోందని ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి జరుగుతోందన్న విషయం జనాలకు తెలియాలన్నారు. బీజేపీ-టీడీపీ మధ్య పొత్తుకు బీటలు పడ్డట్లేననే అనుమానాలు కలుగుతున్నాయి. ఆ రెండు పార్టీల మధ్య స్నేహం వచ్చే పార్లమెంటు బడ్జెట్ సమవేశాలపై ఆధారపడి ఉండవచ్చు. తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్ల పెంపుదల బిల్లు పై నిర్ణయం తీసుకునే వీలుంది. అసెంబ్లీ సీట్ల పెంపు నిర్ణయం ఉంటే టీడీపీకి మంచిది. లేకపోతే ఇబ్బంది పడుతుంది. పెద్ద ఎత్తున పార్టీలో చేరిన వారికి సీట్లు కేటాయించడం తలకు మించిన భారమే. అందుకే బీజేపీ ఆలోచనలో పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సీట్ల పెంపుపై పట్టుదలగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఫిరాయింపులను టీడీపీ ప్రోత్సహిస్తుందని విష్ణుకుమార్ రాజు విమర్శించడం హాట్ టాపికైంది. ఇంకోవైపు పురందేశ్వరి అదే తీరులో మాట్లాడుతున్నారు. మొత్తంగా చంద్రబాబు మాటలు, ఆయన వైరి వర్గంలోని బీజేపీ నేతలకు ఉత్సాహం తెచ్చినట్లుంది. అందుకే మరోసారి వారు మాటల దాడిని కొనసాగిస్తున్నారని తెలుస్తోంది.

2 Comments

  1. It will be a historic blunder if B.J.P and T.D.P alliance is dissolved. The D.N.A of T.D.P supporters is anti Nehru-Indira Dynasty Congress with attendant social equations. It is carrying the lineage of thought process of Sardar Patel, Ambedkar, Deena Dayal Upadhyaya, N.G.Ranga, Loknayak Jaya Prakash Narayan, N.T.R, Sardar Gowthu Latchanna, P.V.G. Raju, Tennati Viswanatham.If by any chance the legend N.T.R had not started T.D.P to restore the ‘Athma Gowravam'(Self Respect) of Telugu people, B.J.P would have occupied the vacuum, as it happened in sister southern state Karnataka.

    • In 2019 elections, who ties with BJP in AP have to sit in opposition. If BJP contest on its own in AP, seats.they will get’ZERO”

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.