అన్నా.. కేసీఆర్‌ను న‌మ్మొచ్చంట‌వా!

తెలంగాణ‌లో అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో తెలియ‌ని అయోమయం. అధినేత కేసీఆర్ చెప్పినా.. ఏదోమూల‌న భ‌యం. అందులోనూ ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో త‌మ‌పై ఇంత‌టి న‌మ్మకాన్ని వ్య‌క్తంచేయ‌టాన్ని నిజ‌మా! కాదా! అనే మీమాంశ‌లో ఉన్నారు. పైగా.. పెద్దాయ‌న‌పై బోలెడు అనుమానం కూడా వ్యక్తంచేస్తున్నారు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే.. టీఆర్ఎస్‌కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు 2019లో ఎంత వ‌ర‌కూ సీటు ఉంటుందనే  అంశంపై  కొద్దిరోజులుగా ఆందోళ‌న పెల్లుబుకుతుంది. దాదాపు 40 మంది పై నియోజ‌క‌వ‌ర్గాల్లో చాలా వ్య‌తిరేక‌త ఉందంటూ నిఘావ‌ర్గాలు ఏనాడో చంద్ర‌శేఖ‌ర్‌కు నివేదిక ఇచ్చిన‌ట్లు స‌మాచారం.  నిజామాబాద్ నుంచి న‌ల్లగొండ వ‌ర‌కూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు చాలామంది దొడ్డిదారిన కాసుల‌కు క‌క్కుర్తిప‌డుతున్న‌వారే అధికం. ఏది కావాల‌న్నా క‌మీష‌న్ ప‌క్కా అన్నంత‌గా చేరారు. పైగా యువ ఎంపీలుగా ఉన్న‌వారిలో ఇద్ద‌రు ముగ్గురు నియోజ‌క‌ర్గాల్లో అందుబాటులో ఉండ‌ర‌నే ఫిర్యాదులు కూడా వున్నాయి. క‌రీంన‌గ‌ర్‌, రంగారెడ్డి, పాల‌మూరు, నిజామాబాద్ జిల్లాల్లో అధిక‌శాతం చీక‌టి దందా చేస్తున్న‌వారే. ఇసుక దందాలు, భూక‌బ్జాల్లో కొంద‌రు ఠాణాల వ‌ర‌కూ చేరారు. ఇదిచాల‌ద‌న్న‌ట్టు ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త కొద్దికొద్దిగా బ‌య‌ట‌ప‌డుతుంది. కాంగ్రెస్‌లోకి వ‌ల‌స‌లు చేరిక‌తో హస్తం దూకుడు పెంచుతుంది. ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, జ‌య‌పాల్‌రెడ్డి వంటి నేత‌లు.. ఐక్య‌తారాగం ఆల‌పిస్తున్నారు.
రేవంత్‌రెడ్డి, నాగం రాక‌తో మాంచి జోష్ మీయ‌త‌దున్నారు. తెలంగాణ జ‌న‌స‌మితి పేరుతో కోదండ‌రాం మాస్టారు కొత్త‌పార్టీను తెచ్చి ఉద్య‌మకారుల‌ను త‌న‌వైపు తిప్పుకున్నారు. తొలి స‌భ‌తోనే అధికార పార్టీకు చెమ‌ట‌లు ప‌ట్టించారు. మేధావివ‌ర్గం దాదాపు అటువైపు ఉంటుంద‌నే సంకేతాలు పంపారు. నిధులు, నీళ్లు ,నియామ‌కాల‌పై స‌ర్కారు ఇప్ప‌టి వ‌ర‌కూ చేసింది నామ‌మాత్ర‌మే. రైతు వ‌ర్గాల్లోనూ బాగా వ్య‌తిరేక‌త ఉంది. మంత్రులు ఉన్నా కేవ‌లం ఉత్స‌వ విగ్ర‌హాలుగా మిగిలామంటూ స్వ‌యంగా అమాత్యులే ఆవేద‌న వెలిబుచ్చుతున్నారు. ఇంతటి విప‌త్క‌ర‌ ప‌రిస్థితుల్లో  త‌మ‌కు సీటు గ్యారంటీ అంటూ.. కేసీఆర్ సారూ మ‌స్త్ బిస్కెట్ వేస్తుండంటూ తెగ ఇదై పోతున్నార‌ట‌. వాస్త‌వానికి కేసీఆర్ ఎమ్మెల్యేల ఎంపిక విష‌యంలో క్లా రిటీగా ఉన్నార‌ట‌. ఎన్నిక‌ల ఖ‌ర్చు విష‌యంలో అంతా తానే చూసుకుంటానంటూ తేల్చిచెప్పార‌ట‌. గ‌తంలో ఎమ్మెల్యేల ప‌నితీరుపై మార్కులు వేయ‌టం.. ర్యాంకులు కేటాయించ‌టానికి కూడా.. ప‌నితీరు కొల‌మాన‌మ‌ట‌. అప్పుడే ఓ కీల‌క నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట‌. ఇదంతా గుట్టుగా సాగుతున్నా.. ఎమ్మెల్యేలకు తెలియ‌క‌పోవ‌టానికి ప్ర‌ధాన కార‌ణం.. నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌ర్వేలు. ప‌నితీరుపై నివేదిక‌ల‌కు సంబంధించిన వ్య‌వ‌హారాల‌న్ని సీక్రెట్‌గా బ‌య‌టి రాష్ట్రాల నుంచి వ‌చ్చిన వారితో చేయించ‌ట‌మేన‌ట‌. 
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.