కేటీఆర్ ఎలా మాయ చేస్తాడంటే…

కాంగ్రెస్ తెలంగాణ‌లో పుట్ట‌లేదు.
బీజేపీ తెలంగాణ‌లో పుట్ట‌లేదు.
సీపీఐ తెలంగాణ‌లో పుట్ట‌లేదు.
సీపీఎం తెలంగాణ‌లో పుట్ట‌లేదు.
బీఎస్పీ తెలంగాణ‌లో పుట్ట‌లేదు…
కానీ తెలంగాణ న‌ట్ట‌న‌డ‌బొడ్డున పుట్టి… తెలంగాణ దొర‌ల‌ను న‌లిపేసి… వారి భూస్వామ్య హ‌క్కులు చెర‌చి.. పేదోడికి హ‌క్కులిచ్చి, అక్క‌చెల్లెళ్ల‌కి ఆస్తిహ‌క్కులు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం. ఇపుడు ఆ పార్టీ అధ్య‌క్షుడు తెలంగాణ‌కు వ‌చ్చి ప్ర‌చారం చేస్తుంటే… మా తెలంగాణ రాజ‌కీయాల్లో వేలు పెడ‌తావా? నీకిక్క‌డ ఏం ప‌ని? అని కేటీఆర్ ప్రశ్నిస్తాడు. ఈయ‌న అమెరికాలో చ‌దువుకున్నాడో, అడ‌విలో చ‌ద‌వుకున్నాడో అర్థం కావ‌డం లేదు. భార‌తీయుడు దేశంలో ఎక్క‌డ‌యినా ఓటు హ‌క్కు పొందొచ్చు. ఎక్క‌డైనా అభ్య‌ర్థిగా నిల‌బ‌డొచ్చు. దేశంలో జాతీయ పార్టీ గుర్తింపు ఒక‌సారి వ‌స్తే అది ఎక్క‌డి నుంచ‌యినా పోటీ చేయొచ్చు.
బీఎస్పీ త‌ర‌ఫున మాయావ‌తి వ‌చ్చి ప్ర‌చారం చేస్తే మాయావ‌తి నీకు ఇక్క‌డ ఏం ప‌ని అని కేటీఆర్ అడ‌గ‌లేదు. మోడీ అమిత్‌షా వ‌చ్చి ప్ర‌చారం చేస్తే గుజ‌రాత్‌కు పో మోడీ షాలు అని చెప్పాలేదు. కానీ… చంద్ర‌బాబు వ‌స్తే నీకు ఇక్క‌డ ఏం ప‌ని అడుగుతున్నాడు కేటీఆర్‌? కేటీఆర్‌కు అన్నీ తెలుసు. కానీ తెలంగాణ ప్ర‌జ‌ల అమాయ‌క‌త్వానికి సెంటిమెంట్ పూసి అడ్డంగా వాడుకోవ‌డం క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి వెన్న‌తో పెట్టిన విద్య‌. మాయావ‌తిని పొమ్మంటే ఓట్లు రాల‌వు. మోడీని పొమ్మంటే ఓట్లు రాల‌వు, రాహుల్‌ని పొమ్మంటే ఓట్లు రాలవు… కానీ చంద్ర‌బాబును పొమ్మంటో ఒక‌టో రెండో ఓట్ల‌యినా రాల‌తాయి. ఎందుకంటే అది క‌ల్వ‌కుంట్ల కుటుంబం నూరిపోసిన విషం. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఆంధ్రులంటే ద్వేషించాలి అని పొద్దున లేస్తే నూరిపోసిన పార్టీ టీఆర్ఎస్‌. అందుకే చేసిన అభివృద్ధి చెప్పుకోలేక‌… కొత్త హామీలిస్తే ప్ర‌జ‌లు న‌మ్మే దిక్కులేక సెంటిమెంట్ మీద ఆధార‌ప‌డ్డారు కేటీఆర్‌, కేసీఆర్‌. జ‌నం తెలుసుకోవాలి.
ఇక్క‌డ ఇంకో విష‌యం ఏంటంటే… మా దాంట్లో వేలు పెట్టావు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో నీ దాంట్లో వేలు పెడ‌తాం చంద్ర‌బాబు అని కేటీఆర్ బెదిరించారు. చంద్ర‌బాబు ఎన్న‌డూ వ‌ద్ద‌న‌లేదు. ఏపీలో ఎవ‌రైనా పోటీ చేసుకోవ‌చ్చు. టీఆర్ఎస్ రావొద్ద‌ని ఎపుడు బాబుచెప్ప‌లేదుగా… మ‌రి ఈ స‌వాళ్లెందుకో మ‌రి కేటీఆర్‌.

1 Comment

  1. కేటీఆర్ పాకిస్తాన్ లో ఏమైనా ఉన్నాడా ? లేక చంద్రబాబు ఏమైనా పరదేశం నుంచి వచ్చాడా? ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకోవడం కేసీఆర్ కుటుంబం నిస్సిగ్గుగా చేస్తున్న పని.ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రాలు వేరుపడినా తెలుగువారి బంధాలు,బంధుత్వాలు,అనుబంధాలు ఏనాటి నుంచో పెనవేసుకుని ఉన్నాయి.తమ రాజకీయ ప్రయోజనం కోసం తెలుగు ప్రజల్లో ద్వేషం రగిలించింది కేసీఆర్ కుటుంబమే.

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.