రేపు ఎంత మంది ప‌రువు పోతుందో?

*వాడికి ఇక్క‌డ డిపాజిట్లు లేవు* ఇది రాయ‌ల‌సీమ‌లో జ‌న నానుడి. అంటే… ఇక్క‌డ అత‌నికి ఎవ‌రి మ‌ద్ద‌తు ల‌భించ‌ద‌ని అర్థం. ఈ నానుడి పుట్టింది మాత్ర‌మే ఎన్నిక‌ల నుంచే. ఎన్నిక‌ల నిబంధ‌న‌ల ప్ర‌కారం పోటీ చేసిన ప్ర‌తి అభ్య‌ర్థి ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ప‌ది వేల రూపాయ‌లు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. అదే ఎస్సీలు, ఎస్టీల‌కు కేవలం ఐదు వేలే. ఈ నిబంధ‌న ఎందుకు పెట్టారంటే… ఎన్నిక నిర్వ‌హించ‌డం ఎంతో ఖ‌ర్చుతో కూడుకున్న ప‌ని. స్టేష‌న‌రీ ఖ‌ర్చు కూడా భారీగానే ఉంటుంది. అభ్య‌ర్థి క‌ట్టే డిపాజిట్ స్టేష‌న‌రీ ఖ‌ర్చుకు కూడా రాదు. అందుకే ఎవ‌రు ప‌డితే వారు స‌ర‌దాగా పోటీచేయ‌కుండా ఆస‌క్తి ఉంటేనే పోటీ చేయాల‌నే ఉద్దేశంతో ఈ డిపాజిట్‌ను పెట్టారు.
పోలయిన ఓట్ల‌లో ఆరో వంతు ఓట్లు వ‌స్తేనే డిపాజిట్ తిరిగి ఇస్తారు. లేదంటే… తిరిగి ఇవ్వ‌రు. ప్ర‌తి ఎన్నిక‌లో ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో ఈ డిపాజిట్ కోల్పోయే వారి శాతం భారీగానే ఉంటుంది. అయినో *ఎమ్మెల్యే అభ్య‌ర్థి అనిపించుకోవ‌డం అదో తృప్తి* కొంద‌రికి. అందుకే పోటీలో నిల‌బ‌డుతుంటారు. పెద్ద పార్టీల వారికి డిపాజిట్లు కోల్పోయే సంద‌ర్భాలు చాలా అరుదు. మొన్న రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అత్య‌ధిక స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. ఇది చ‌రిత్ర‌లోనే ఒక రికార్డు.
అయితే, ప‌లు పార్టీల్లో టిక్కెట్ ద‌క్కక కోపంతో రెబ‌ల్‌గా పోటీ చేసే వాళ్లు మాత్రం డిపాజిట్ పోవ‌డాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణిస్తారు. అవ‌మానంగా భావిస్తారు. ఎందుకంటే పార్టీని దెబ్బ‌కొడ‌దామ‌ని నిల‌బ‌డి డిపాజిట్ ద‌క్కించుకోక‌పోతే ఇక ఏ పార్టీలో అలాంటి వారికి అవ‌కాశం ఉండ‌దు. అందుకే రెబ‌ల్ గా అంత ఈజీగా ఎవ‌రూ వేరు. మ‌రి ఈసారి 1821 మంది అభ్య‌ర్థులు తెలంగాణ‌లో పోటీ చేస్తున్నారు. ఎంత మందికి డిపాజిట్లు పోతాయో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.