ఎవడీ దగుల్బాజీ స్వామిజీ !

ఎవడీ దగుల్బాజీ స్వామిజీ ! ఇలాంటి పనికిమాలినోళ్ళా హిందూమతాన్ని రక్షించేది !! ఈయన బిజెపి లో చేరిన మరుక్షణం నుండే ఈ అరాచకాలు ! బిజెపి ఇలాంటి వారికి మద్దతు పలికి, ఇక్కడ మరో డేరాబాబా ను సృష్టించాలనుకుంటుందా ! ఇలాంటి స్వామీజీలను, ఆశ్రమాలను అడ్డం పెట్టుకొని, హిందూ మతం అనే ముసుగు వేసుకోని సమాజంలో భయోత్పాతం సృష్టించి ఆ భయం లోనుండి అధికారాన్ని అందుకోనే ప్రయత్నాలు ఇంతకుముందు ఉత్తరభారతంలో జరిగాయి. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ బిజెపి ఇదే ప్రయత్నం చేస్తుంది.
మరోసారి ఏ స్వామిజీ, ఆశ్రమం‌ ,తొక్కా, తోటకూర అంటూ వచ్చి ఉన్మాదాన్ని నూరిపోస్తుంటే తొక్కిపట్టి నారదీయాలి. లేదంటే హిందువులు అంటే ప్రపంచం ఉన్మాదులు అని చూస్తుంది. హిందూ మతాన్ని నిజంగా పాటించేవాళ్ళు ఈ స్వామిజీలకు దూరంగా ఉండండి. సాయంత్రం వీధి చివరన గుడికి వెళ్ళండి, ప్రశాంతంగా ఒక నమస్కారం చేసుకోని రండి. దేవుడు మీ దగ్గరనుండి అంతకన్నా ఏమీ ఆశించడు. వీలైతే పదిమందికి సహాయం చేయండి. దేవుడు ఇంకా సంతోషిస్తాడు. ఎలాంటి స్వామిజీలను, ఆశ్రమాలను ఆశ్రయించకండి.

 

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.