అభివృద్ధిపై శ్వేత‌ప‌త్రం…వావ్ భ‌లే ఎమ్మెల్యే…

ఈయన ప్రభాకర్ చౌదరి. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే. అందరు రాజకీయ నేతలకంటే భిన్నంగా ఉండాలని కోరుకుంటారు. అదే ఆకాంక్షతో పనిచేయడం ఆయన ప్రత్యేకత. జిల్లాలో ఏ ఎమ్మెల్యే కూడా తాము చేపట్టిన పనులపై శ్వేతపత్రం విడుదల చేయలేదు. ప్రభాకర్ చౌదరి మాత్రం ఒక్క ఏడాది కూడా మిస్‌ అవకుండా తన నియోజకవర్గ అభివృద్ధిపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఇందులో తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన పనులను ప్రజలకు సవివరంగా చెప్పుకొస్తున్నారు. శిల్పారామంలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్ ఎన్.ఎం.డి.ఫరూక్, ప్రభుత్వ చీఫ్‌విప్ పల్లె రఘునాథరెడ్డి, టూరిజం ఛైర్మన్ జయరామిరెడ్డి, ఎంపీ కనకమేడల రవీంద్ర, ఇతర ప్రజాప్రతినిధులు, కళాకారులు హాజయ్యారు. ఇందులో ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి తన నాలుగేళ్ల పాలనలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేశారు. స్వదస్తూరితో విడుదల చేసిన ఈ పత్రాన్ని మీడియావారికి కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా మిగతా నియోజకవర్గాల్లో కూడా నేతలు ఈ మార్గాన్ని అనుసరిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

శ్వేతపత్రంలోపేర్కొన్న వివరాల ప్రకారం… అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన ప్రభాకర్‌ చౌదరి తొలి ఏడాది పెద్దగా అభివృద్ధి పనులు కొనసాగించలేకపోయారు. రాష్ట్ర విభజన తర్వాత నెలకొన్న పరిస్థితులే దీనికి కారణం. ఆ తర్వాత మూడేళ్లలో మాత్రం తాను అనుకున్న ఎన్నో కార్యక్రమాలను సాకారం చేసుకోగలిగానని ప్రభాకర్‌చౌదరి శ్వేతపత్రంలో చెప్పుకొచ్చారు. ఎందుకూ కొరగాకుండా పోయిన సెంట్రల్ పార్కును శిల్పారామంగా తీర్చదిద్దారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రజల కోసం ఓపెన్ జిమ్‌లు ఏర్పాటుచేశారు. నీలం సంజీవరెడ్డి స్టేడియంని రెండు కోట్ల రూపాయల ఖర్చుతో ఆధునీకరించారు. ఇక్కడే ముఖ్యమంత్రి నేతృత్వంలో స్వాతంత్య్ర వేడుకలను నిర్వహింపచేశారు. ఎమ్మెల్యేగా ప్రభాకర్‌చౌదరికి నియోజకవర్గంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. సొంత పార్టీలోనే కొన్ని వర్గాలు ఆయన దూకుడుకి అడ్డుపడాలని చూశాయి. అయినా ఆయన అదరక బెదరక ముందుకు సాగుతున్నారు. అన్ని విషయాల్లో నిబద్దత చాటుకోవడం ఆయన ప్రత్యేకత. అసెంబ్లీ సమావేశాలకు ఆయన ఒక్క రోజు కూడా గైర్హాజరు కాలేదు. అదీ ఆయన పట్టుదలకి నిదర్శనం. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.