పార్లమెంటులో ఏం జరగనుంది…

పార్లమెంటు సమావేశాలు ముగింపు దశకు వచ్చాయి. ఇక నాలుగు రోజులే మిగిలాయి. ఈ 4 రోజుల్లో అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుందా? తీర్మానాలిచ్చిన కాంగ్రెస్‌‌, టీడీపీ, వైసీపీ ఏం చేయబోతున్నాయనే చర్చసాగుతోంది. తెలుగు ప్రజల కోసం ఢిల్లీ టూర్‌‌లో చంద్రబాబు ధర్నాకు దిగుతారనే వాదన సాగుతోంది. మరోవైపు పవన్‌ కల్యాణ్‌ ఆమరణ దీక్షకు దిగుతారనే వాదన లేకపోలేదు. రాజీనామాలు చేశాక వైసీపీ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
పార్లమెంట్‌లో హోదా పోరు చివరి అంకానికి చేరింది. ఇప్పుడు అందరి చూపూ ఏప్రిల్‌ ఐదుపైనే. ఎందుకంటే ఏప్రిల్‌ 5 తర్వాత పార్లమెంట్‌ నిరవధిక వాయిదా పడుతుంది… అవిశ్వాసంపై చర్చ జరగకుండానే గడిచిపోతోంది. అవిశ్వాస తీర్మానాలిచ్చిన కాంగ్రెస్‌‌, టీడీపీ, వైసీపి, సిపిఎం వంటి ఆరు పార్టీలు ఏం చేయబోతున్నాయనేది ఉత్కంఠను పెంచుతోంది.
అవి‌శ్వాస తీర్మానాలపై చర్చ చేపట్టేందుకు కేంద్రం భయపడుతోంది. అవిశ్వాసంపై చర్చ జరగకపోతే వైసీపీ, టీడీపీ ఏం చేయాలనే అంశంపై సమాలోచనలు చేస్తున్నాయి. కేంద్రంపై ఒత్తిడి పెంచే పనులు చేయనున్నాయి. వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేయనున్నారు. అయితే వాటిని ఆమోదిస్తారా లేదా అనేది ఆసక్తికరమే. మరోవైపు చంద్రబాబు కార్యాచరణపైనా దృష్టి పెడుతోంది కేంద్రం. పవన్‌ కల్యాణ్‌ మాటలకే పరిమితమవుతున్నారు. ఆచరణ అంతగా ఉండటం లేదు. మీరు అవిశ్వాస తీర్మానం పెట్టండి. నేను చూసుకుంటానని గట్టిగానే చెప్పారు. కానీ తర్వాత ఆ సంగతే మర్చిపోయారు. వినే వాళ్లు వెర్రి వాళ్లు అనే తరహాలో వ్యవహరిస్తున్నారాయన. 
మరోవైపు కావేరి బోర్డు కోసం పోరాడుతోన్న అన్నాడీఎంకే తమ పోరును ఉధృతం చేస్తోంది. ఫలితంగా లోక్‌సభ సజావుగా సాగే అవకాశమే కనిపించడం లేదు. సభ ఆర్డర్‌లో లేకపోతే చర్చ చేపట్టే ప్రసక్తే లేదని స్పీకర్‌ చెబుతున్నారు. ఫలితంగా అవిశ్వాసంపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితే కనిపిస్తోంది. హోదా పోరు ఢిల్లీ నుంచి గల్లీకి మారడం ఖాయంగా కనిపిస్తోంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.