ఈ ఏపీ  కాంగ్రెస్‌కు ఏమైంది? 

గ‌త‌కొంత‌కాలంగా నాదెండ్ల మనోహర్‌కు పీసీసీ అధ్యక్ష పదవిని ఇస్తున్నారనే ప్రచారం జ‌రిగింది. అయితే ఇంత‌లోనే ఏమైందో మ‌రి మనోహర్ వెళ్లి పవన్ కల్యాణ్‌ను క‌లిశారు. ఈ సమావేశం త‌రువాత ఆయ‌న ఏమీ మాట్లాడ‌లేదు. కాంగ్రెస్ తరఫున చర్చల కోసం వెళ్లారో లేక తన రాజకీయ భవిష్యత్తు కోసం వెళ్లారో వెల్ల‌డించ‌నేలేదు. అయితే మనోహర్ కాంగ్రెస్ తరఫున వెళ్ల‌లేద‌ని, జనసేనలోకి చేరడానికే వెళ్లార‌నే వార్తలు వస్తున్నాయి. అయితే పీసీసీ అధ్యక్షుడు కాబోతున్నాడ‌నుకుంటున్న వ్యక్తి ఇలా ప్ర‌వ‌ర్తించ‌డాన్ని అంద‌రూ వింత‌గా చూస్తున్నారు. ఒకవైపు రాహుల్ ఇటేవలే ఏపీ నేతలతో సమావేశ మ‌య్యారు. కాంగ్రెస్‌ నుంచి బయటకు వెళ్లిన వారిని తిరిగి రప్పించండి అని  రాహుల్ వారికి సూచించారని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్‌లో ప్ర‌స్తుతం ఊహించ‌ని ప‌రిణామాలు ఎదుర‌వుతున్నాయి. పార్టీ నుంచి వెళ్లిన వారిని రప్పించండి అని రాహుల్ చెబితే… కాంగ్రెస్ వారంతా త‌మ అవకాశాలను చూసుకుంటున్నారు. ఒక‌వేళ మనోహర్ జనసేనలో చేరితే, మిగిలిన వారు కూడా తలా ఒక దిక్కున వెళిపోతార‌ని తెలుస్తోంది. రఘువీరారెడ్డి వైసీపీ వైపు వెళ్లవచ్చని అంచనా వేస్తున్నారు. కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి అటు వైసీపీలోకి వెళ్లలేక కాంగ్రెస్ లో కొనసాగుతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. ఇక మిగిలిన వాళ్లను  పార్టీలు కూడా ప‌ట్టించుకోక‌పోవ‌డం విశేషం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.